శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2024 (11:24 IST)

దేశం కోసమే మా పోరాటం : ప్రియాంకా గాంధీ

priyanka gandhi
తమ కుటుంబం దేశం కోసం పోరాటం చేస్తున్నామని వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ అన్నారు. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాస్తుందని ఆరోపించారు. ఒకరిద్దరు తమ వ్యాపార మిత్రులకు దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై మాట్లాడుతూ, 'ఏ వ్యవస్థలపై ఈ దేశ నిర్మాణం జరిగిందో ఆ వ్యవస్థలను అధికారంలో ఉన్న వారు నాశనం చేస్తున్నారు. అందుకే దేశం కోసం మేం పోరాటం చేస్తున్నాం' అని అన్నారు. వయనాడ్ విపత్తు బాధితులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మొండిచేయి చూపాయని దుయ్యబట్టారు.
 
మరోవైపు, కొద్ది మంది కుబేరులే లబ్ధి పొందున్నంత కాలం దేశం ప్రగతి సాధించ లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానిం చారు. ఒకవైపు అభివృద్ధి ఫలాలు కొద్ది మంది కోటీశ్వరులే అందుకుంటూ మరోవైపు ఆర్థిక విపత్తుల కారణంగా రైతులు, కార్మికులు, మధ్యతర గతి ప్రజలు జీవనం కోసం పోరాడుతుంటే అది ప్రగతి అనిపించుకోదన్నారు. జీడీపీ వృద్ధి బాగా తగ్గినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ మేరకు ట్వీట్ చేశారు.