బుధవారం, 6 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 31 మే 2019 (13:00 IST)

ఆరు గంటలు ఆడాడు.. పబ్జీ గేమ్‌ ప్రాణం తీసింది..

పబ్జీ గేమ్‌ ద్వారా ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. తాజాగా వరుసగా ఆరు గంటల పాటు పబ్జీ గేమ్ ఆడిన 12వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. తీవ్ర ఒత్తిడిలో ఆరు గంటల పాటు తదేకంగా స్క్రీన్‌ను చూస్తూ పబ్జీ ఆడిన విద్యార్థికి ఉన్నట్టుండి గుండెపోటు రావడంతో పన్నెండో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. 
 
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన నీమూచ్ టౌన్‌కు చెందిన ఖురేషి 12వ తరగతి విద్యార్థి. ఇతడు గంటల పాటు పబ్జీ గేమ్ ఆడేవాడు. ఈ క్రమంలో మే 28వ తేదీ మధ్యాహ్నం భోజనానికి అనంతరం.. పబ్జీ ఆడటం మొదలెట్టాడు. ఇలా ఆరు గంటల పాటు పబ్జీ ఆడుతూ వచ్చిన ఖురేషి కోపాన్ని ప్రదర్శించాడని ఆతని తండ్రి చెప్పారు. 
 
పబ్జీ ఆడేటప్పుడు ఖురేషి గట్టిగా అరిచి ఆడేవాడని.. ఉన్నట్టుండి మరీ ఎక్కువ శబ్ధంతో అరవడం మెదలెట్టాడని, ఇంకా ఆ గేమ్‌లో ఓడిపోవడం ద్వారా ఇయర్స్ ఫోన్స్, ఫోన్‌ను విసిరికొట్టాడని అతని సోదరి వెల్లడించింది. 
 
అంతేగాకుండా ఉన్నట్టుండి ఖురేషి కుప్పకూలిపోవడంతో అతనిని ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని వైద్యులు నిర్ధారించారు. స్విమ్మింగ్ అలవాటున్న ఖురేషి గుండె ఆరోగ్యంగా వున్నప్పటికీ పబ్జీ గేమ్‌కు అడిక్ట్ కావడం ద్వారా తీవ్ర ఒత్తిడికి లోనై గుండెపోటును కొనితెచ్చుకున్నాడని వైద్యులు తెలిపారు. దీంతో ఖురేషి ఇంట విషాదం నెలకొంది.