బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 అక్టోబరు 2024 (13:14 IST)

రాహుల్ గాంధీకి పూణే కోర్టు సమన్లు.. ఎందుకో తెలుసా?

Rahul Gandhi
కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీకి పూణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. పరువు నష్టం కేసులో కోర్టు రాహుల్ గాంధీకి నోటీసు జారీ చేసింది. 
 
కాగా గతేడాది లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌పై రాహుల్‌ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పూణె కోర్టులో పరువు నష్టం దావా వేశారు.
 
కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ వివిధ సందర్భాల్లో పదే పదే సావర్కర్ పరువు తీస్తున్నారని సావర్కర్ సోదరుడి మనవడు సాత్యకి పూణే కోర్టును ఆశ్రయించారు. రాహుల్‌ని చట్ట ప్రకారం విచారించి శిక్షించాలని, నష్టపరిహారం విధించాలని సాత్యకి కోరారు.