Widgets Magazine

అక్రమ సంబంధం... 40 ఏళ్ల మహిళను గొడ్డలితో నరికి మృతదేహం పక్కనే నిలబడి వీడియో...

సోమవారం, 29 మే 2017 (15:30 IST)

Widgets Magazine
Ritu-Murdered

రాక్షసత్వం పెచ్చరిల్లిపోతోంది. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మనిషిని మరో మనిషి అత్యంత కిరాతకంగా హతమారుస్తున్న సంఘటనలు ఎక్కువవుతున్నాయి. కారణం ఏదైతేనేం ఈ దారుణాలు మాత్రం రాక్షసులనే గుర్తుకు తెస్తున్నాయి. అసలు రాక్షసులు అంటే ఎలా వుంటారో తెలియదు కానీ.. ఇలా కత్తులు, గొడ్డళ్లు, మారణాయుధాలతో తోటి మనిషిని దారుణంగా నరికి చంపుతున్నవారిని చూసినప్పుడు మాత్రం వారే రాక్షసులా అని అనుకోవాల్సి వస్తుంది. ఆదివారం నాడు పంజాబ్ లుధియానాలో ఓ ఘోరం జరిగింది. జనం అంతా చూస్తుండగానే నడిరోడ్డుపై 40 ఏళ్ల మహిళను అత్యంత దారుణంగా నరికి చంపిన ఘటన తీవ్ర సంచలనం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే... పంజాబ్ లుథియానాకు 30 కిలోమీటర్ల దూరంలో వున్న కిలా రాయ్‌పూర్ అనే గ్రామానికి చెందిన సరబ్జిత్ కౌర్ 40 ఏళ్ల మహిళ తన ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో మణిందర్ సింగ్ అనే యువకుడు హఠాత్తుగా ఆమెపై గొడ్డలితో విరుచుకపడ్డాడు. ఆమె మెడపైన విచక్షణా రహితంగా నరకాడు. ఆమె కిందపడిపోగానే చెస్ట్ పైన గొడ్డలితో పదేపదే నరికి చంపాడు. ఆమె రక్తపు మడుగులో పడి విగతజీవిగా మారిన తర్వాత ఆమె మృతదేహాన్ని తన స్మార్ట్ ఫోనులో చిత్రించాడు. 
 
ఆ తర్వాత ఆమె మృతదేహం ప్రక్కనే నిలబడి, ఆమెను చంపడానికి కారణాన్ని చెపుతూ తనకు తనే కెమెరాలో షూట్ చేసి ఆ వీడియోను నెట్లో అప్ చేశాడు. ఆ మహిళను తనే హత్య చేశానని వీడియోలో చెప్పాడు. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం... ఇతడికి మరో యువతితో అక్రమ సంబంధం వున్నది. 
 
ఈ విషయం సరబ్జిత్ కౌర్ కు తెలియడంతో తనను ఆమె బ్లాక్ మెయిల్ చేస్తోందనీ, ఈ విషయాన్ని బయటపెడతానని పదేపదే బెదిరిస్తుండటంతో దాన్ని తట్టుకోలేక ఆమెను నరికి చంపినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

సాయిశివశ్రీ నా బిడ్డ కాదు.. సుమశ్రీ నా భార్య కాదు.. మానవతాదృక్పథంతోనే చేరదీశా: శివకుమార్

నాన్నా నాకు ట్రీట్మెంట్ చేయించండి అంటూ చనిపోయేందుకు కొన్ని రోజుల ముందు లుకేమియా వ్యాధితో ...

news

కొడనాడు ఎస్టేట్‌ను అమ్మ, చిన్నమ్మ లాగేసుకున్నారు.. 150 మంది గూండాలను పంపించి..?

దివంగత ముఖ్యమంత్రి జయలలిత, ఆమె నెచ్చెలి శశికళ కలిసి కొడనాడు ఎస్టేట్‌ను బలవంతంగా అసలు ...

news

ఉత్తర కొరియా మూడో క్షిపణి ప్రయోగం- జపాన్ సముద్ర జలాల్లో పడింది.. కిమ్‍‌పై అబే ఫైర్?

ఉత్తర కొరియా కిమ్ జోంగ్ ఉన్ దూకుడును మరింత పెంచారు. ఎవరి మాట వినకుండా.. ప్రపంచ దేశాలను ...

news

ఏసీ ఆన్ చేసి కారులోనే విశ్రాంతి.. నవ వధువుతో పాటు తల్లిదండ్రులు నిప్పుకు బలి.. ఎలా?

తమిళనాడులోని మహాబలిపురం సమీపంలోని ఈసీఆర్ రోడ్డులో ఘోరం జరిగింది. రోడ్డు పక్కనే నిల్చున్న ...