సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (19:35 IST)

జీ-20 శిఖరాగ్ర సదస్సు.. 500 వంటకాలు.. బంగారు, వెండి పూత..?

food
జీ-20 శిఖరాగ్ర సదస్సు కోసం ఢిల్లీ ముస్తాబైంది. ఢిల్లీ నగరం అంతటా రోడ్డు జంక్షన్లు, రోడ్డు పక్కన భవనాలు సుందరీకరించబడ్డాయి. విదేశీ నేతల ప్రయాణాలకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఢిల్లీ ప్రజలకు నాలుగు రోజుల సెలవులు ఇచ్చారు. శని, ఆదివారాల్లో ఢిల్లీలో ట్యాక్సీలు, ఆటోల నిర్వహణపై ఆంక్షలు విధించారు. 
 
భద్రత కోసం 2 లక్షల మంది భద్రతా బలగాలను మోహరించారు. సైన్యం సిద్ధంగా వుంది. విదేశాల నుంచి వచ్చే నేతల కోసం 500 రకాల వంటకాలతో విందు సిద్ధం చేశారు. బంగారం, వెండి పూత పూసిన పాత్రలలో ఆహారాన్ని అందిస్తారు.
 
విదేశీ నేతలను భద్రతా బాధ్యతలను 17 మంది కేంద్ర మంత్రులకు అప్పగించారు. జి-20 సదస్సు దృష్ట్యా ఢిల్లీలోని కళాశాలలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. 
 
నేరాల నివారణకు కృత్రిమ మేధస్సు సాయంతో బందోబస్తు ఏర్పాటు చేశారు. విదేశీ నేతలు పర్యటించే ప్రాంతాల్లో 5000 నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు.