మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 13 ఏప్రియల్ 2024 (21:34 IST)

లోక్‌సభ ఎన్నికలు.. కేరళలో రాహుల్ గాంధీ 4 రోజుల పర్యటన

Rahul Gandhi
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన పార్టీకి ఎక్కువ ఓట్లు రాబట్టే ప్రయత్నంలో నాలుగు రోజుల పాటు కేరళ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. సోమవారం కోజికోడ్ చేరుకుని అక్కడ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తారు.
 
మంగళవారం ఆయన తన వాయనాడ్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గురువారం రాహుల్ గాంధీ కన్నూర్, పాలక్కాడ్, కొట్టాయంలో ప్రచారం నిర్వహించనున్నారు. త్రిసూర్, తిరువనంతపురం, అలప్పుజాలను కూడా ఆయన సందర్శిస్తారు.
 
ఏప్రిల్ 16న కర్ణాటక ఉపముఖ్యమంత్రి డి.కె.శివకుమార్ తిరువనంతపురం, కన్నూర్, వడకర, కోజికోడ్, మలప్పురంలలో ప్రచారం చేయనున్నారు. కేరళలో ఏప్రిల్ 26న 20 మంది లోక్‌సభ సభ్యులను ఎన్నుకునేందుకు ఎన్నికలు జరగనున్నాయి.