ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయి.. పంటలకు ఇబ్బంది వుండదు

chennai rains
మోహన్| Last Updated: సోమవారం, 15 ఏప్రియల్ 2019 (18:17 IST)
2019 సంవత్సరానికి వాతావరణ అంచనాలను భారత వాతావరణ శాఖ(ఐఎండీ) విడుదల చేసింది. ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే నమోదవుతుంది ఐఎండీ తెలిపింది, అలాగే 96 శాతం సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసింది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళను తాకే అవకాశం ఉంది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంపై మే 15న ధ్రువీకరిస్తామన్నారు. 
 
ఈ ఏడాది దేశంలో మంచి వర్షాలే కురుస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ తెలిపారు. ఖరీఫ్‌లో రైతులకు అనుకూలంగా వర్షపాతం ఉండే అవకాశం ఉందన్నారు. గత రెండేళ్లలాగే ఈసారి కూడా సాధారణ వర్షాలు కురుస్తాయి. 
 
పంటలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంది. ఎల్‌నినో ప్రభావం భారత్‌పై అంతగా ఉండదు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదవుతుంది. ఈ ఏడాది నుంచి ఉరుములు, పిడుగుపాటు హెచ్చరికల వ్యవస్థలను కూడా ప్రారంభిస్తామని తెలిపారు.దీనిపై మరింత చదవండి :