Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రాయ్‌పూర్‌లో వితంతువును బెదిరించి గ్యాంగ్ రేప్

బుధవారం, 27 డిశెంబరు 2017 (13:56 IST)

Widgets Magazine
rape victim

ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌ నగర శివారు ప్రాంతంలో ఓ వితంతువుపై సామూహిక అత్యాచారం జరిగింది. హోటల్‌లో పని చేసే సహోద్యోగి నమ్మించి నిర్జన ప్రదేశానికి తీసుకెళ్ళగా ఈ దారుణం జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
రాయ్‌పూర్‌కు చెందిన వితంతువు ఓ హోటల్‌లో కిచెన్‌లో పాచిపని చేస్తూ వస్తోంది. అదే హోటల్‌లో పని చేస్తున్న సురేశ్ సాహు(24) అనే యువకుడితో ఈమెకు పరిచయం ఏర్పడి, అది మరింత సన్నిహితంగా మారింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఆమెకు మాయమాటలు చెప్పి నిర్జనప్రదేశానికి తీసుకెళ్లాడు. 
 
అక్కడ ఆమెపై అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె ప్రతిఘటించి, కేకలు వేసింది. ఈ కేకలు ఆలకించి ముగ్గురు వ్యక్తులు అక్కడకు చేరుకుని సాహును బెదిరించి తరిమిగొట్టారు. అనంతరం ఈ ముగ్గురు కలిసి ఆ వితంతువుపై అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తామని బాధితురాలిని బెదిరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్టు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

జయలలిత వీడియోతోనే దినకరన్‌కు గెలుపు.. డబ్బే గొప్పది: కేతిరెడ్డి

ఆర్కే నగర్ ఉప ఎన్నికలకు ఒక రోజు ముందు దివంగత సీఎం జయలలిత ఆస్పత్రి వీడియోను విడుదల చేయడం ...

news

గెలిచాక బుద్ధిచూపిన దినకరన్ ... అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన స్థానిక నేతలు

ఆర్కే.నగర్ ఉపఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన అన్నాడీఎంకే అసమ్మతి నేత టీటీవీ ...

news

పాకిస్థాన్ మీడియా ఓవరాక్షన్.. జాదవ్ తల్లిని అలా సంబోధించింది..

భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్ తల్లిపై పాకిస్థాన్ మీడియా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ...

news

ప్రయాణికులకు చుక్కలు చూపుతున్న హైదరాబాద్ మెట్రో జర్నీ

హైదరాబాద్ నగరంలో ప్రయాణికులకు మెట్రో రైల్ జర్నీ పగటిపూట చుక్కలు చూపుతోంది. నిమిషాల్లో ...

Widgets Magazine