బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 6 జనవరి 2022 (15:20 IST)

బాలికను అత్యాచారం చేసి చెట్టుకు ఉరేసి వేలాడదీసిన కిరాతకుడు

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ 18 యేళ్ల బాలికను గుర్తు తెలియని వ్యక్తులు తొలుత అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపేశారు. పిమ్మట చెట్టుకు ఉరేసి వేలాడదీశారు. ఈ దారుణం రాష్ట్రంలోని దుంగాపూర్ జిల్లా సంగ్వారాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గత సోమవారం ఈ గ్రామంలో ఓ చెట్టుకు వేలాడుతున్న 18 యేళ్ళ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరిపారు. 
 
ఈ విచారణలో మృతురాలికి ఇటీవల ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత ఆమె కాబోయే భర్తతో మాట్లాడసాగింది. అయితే, ఆ యువతిని ఏకపక్షంగా ప్రేమిస్తూ వచ్చిన నిందితుడు ముఖేష్ నానోమా... ఆ యువతి తనకు దక్కలేదన్న కోపంతో హత్య చేసినట్టు తేలింది. ఈ కేసులో నిందితుడిని కేవలం 20 గంటల్లోనే అరెస్టు చేయడం గమనార్హం. 
 
అతనివద్ద జరిపిన విచారణలో ఆ యువతిని చిన్నప్పటి నుంచి ప్రేమిస్తూ వచ్చాడని, ఆమె మరో వ్యక్తికి దగ్గరవ్వడాన్ని జీర్ణించుకోలేక హత్య చేసినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు. ముందు అత్యాచారం చేసి ఆ తర్వాత తలపై రాయితో కొట్టి చంపి మఫ్లర్‌తో చెట్టుకు వేలాడదీసినట్టు చెప్పాడు.