శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 సెప్టెంబరు 2023 (09:30 IST)

అక్రమ సంబంధం: ఆ పాపానికి మహిళను నగ్నంగా ఊరేగించారు..

woman
అక్రమ సంబంధం పెట్టుకున్న పాపానికి ఆ మహిళకు ఘోర అవమానం జరిగింది. మణిపూర్ తరహాలో అక్రమ సంబంధం పెట్టుకుందంటూ ఓ గిరిజన యువతిని ఆమె భర్త అత్తమామలు వీధుల్లో నగ్నంగా ఊరేగించారు. 
 
భర్తను కాదని ప్రియుడితో వుంటున్న మహిళను ఆమె భర్త అత్తమామలు కిడ్నాప్ చేసి తమ స్వగ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఇష్టారీతిన చేయిచేసుకుని ఆపై నగ్నంగా గ్రామంలో ఊరేగించారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఈ అమానవీయ ఘటనను ఖండించారు. 
 
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని రాజస్థాన్ డీజీపీ తెలిపారు. మరికొన్ని గంటల్లో మిగిలిన వారిని కూడా పట్టుకుంటామని హామీ ఇచ్చారు. 
 
ఇకపోతే.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు ఈ చర్యపై తీవ్రంగా మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.