సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 సెప్టెంబరు 2021 (12:33 IST)

ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు.. రీట్ ఎగ్జామ్ విద్యార్థుల దుర్మరణం

రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపూర్‌లో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జైపూర్‌లో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. 
 
ఈ ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులతో పాటు కారు డ్రైవర్‌ ఘటనాస్థలిలోనే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. 
 
విద్యార్థులు రీట్ ప్రవేశ పరీక్షకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.