Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రజినీకాంత్‌కు ప్రధాని మోదీపై కోపమా...? అందుకే పార్టీ పెట్టాలనుకుంటున్నారా...?

శుక్రవారం, 19 మే 2017 (16:34 IST)

Widgets Magazine

దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ హఠాత్తుగా రాజకీయ పార్టీ అనే వార్త ఇప్పుడు దేశంలో పెద్ద చర్చగా మారింది. వాస్తవానికి రజినీకాంత్ ఎవ్వరినీ శుత్రువులుగా భావించలేరు. రాజకీయాల్లోకి వస్తే పార్టీ పరంగా శత్రువులు తయారవుతారు. అందువల్ల ఆ పరిస్థితి రాకూడదని ఏకంగా రాజకీయాల్లోకే రాకుండా చాలాకాలంగా వుండిపోతూ వస్తున్నారు. 
rajinikanth
 
జయలలిత మరణం... ఆ తర్వాత వరుసగా తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, రాజకీయ నాయకులపై ఐటీ శాఖ దాడులు... ఇలా వరుసగా తమిళనాడును మోదీ టార్గెట్ చేశారనే ప్రచారం కూడా నడిచింది. ఇదిలావుంటే తాజాగా రజినీకాంత్ కేంద్ర మాజీమంత్రి చిదంబరంతో సమావేశం కావడం చర్చనీయాంశమైంది. చిదంబరంతో రజినీకాంత్ గంటలకొద్దీ సంభాషణలు జరిపారు. 
 
తెల్లారగానే చిదంబరంపై సీబీఐ దాడులు జరిగాయి. దేశంలో ఆయన కుటుంబసభ్యులకు చెందిన అన్ని ప్రాంతాల్లోనూ ఏకకాలంలో సీబీఐ దాడులు నిర్వహించింది. దీనిపై రజినీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అందువల్లనే రాజకీయ పార్టీ పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు చర్చ జరుగుతోంది. ఐతే మీడియాలో రకరకాల ఊహాగానాలు రావడాన్ని రజినీకాంత్ కొట్టిపారేశారు. అవన్నీ తను పట్టించుకునే దశలో లేనని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఇంతకీ... రజినీకాంత్ నిజంగా ప్రధానమంత్రి మోదీపై కోపంగా వున్నారా..? అనేది ప్రస్తుతం ప్రశ్నగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tamilnadu Aidmk Chidambaram Narendra Modi Rajinikanth Angry

Loading comments ...

తెలుగు వార్తలు

news

గెస్ట‌హౌస్‌లో ప్రజాప్రతినిధి రాసలీలలు.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు.. ఎవరతను?

తెలంగాణా రాష్ట్రంలో ఓ ప్రజాప్రతినిధి ప్రభుత్వ అతిథి గృహంలో రాసలీలలు కొనసాగిస్తూ ప్రభుత్వ ...

news

ప్రేమ పేరుతో మోసం.. పాప పుట్టాక దుబాయ్‌కి జంప్.. ఫోన్ చేస్తే చంపేస్తానన్నాడు..

ప్రేమ పేరుతో అమ్మాయిని లోబరుచుకున్నాడు. పెళ్లి చేసుకోకుండానే కాపురం చేశాడు. అమాయకత్వాన్ని ...

news

రజనీకాంత్‌కు ఇంగ్లీష్ రాదు.. సీఎంగా పనికిరాడు : సుబ్రమణ్య స్వామి

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను లక్ష్యంగా చేసుకుని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు ...

news

వాహనాలు తగలబడిపోతున్నాయ్ : 47 డిగ్రీల ఉష్ణోగ్రత... వాతావరణ శాఖ హెచ్చరిక

తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ...

Widgets Magazine