Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

తమిళనాడుకు 'అచ్చే దిన్' రాలేదు... కాషాయ రంగు రజనీకి సూటవుతుంది...

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (13:18 IST)

Widgets Magazine
kamal haasan

విశ్వనటుడు కమల్ హాసన్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ రాలేదన్నారు. అలాగే, ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపోతే, తన వంటికి కాషాయపు రంగు సూట్ కాదానీ, ఆ రంగు సూపర్ స్టార్ రజినీకాంత్‌కు సూటవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
తాజా రాజకీయ పరిణామాలపై కమల్ హాసన్ ఎన్డీటీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. బీజేపీకి తన కంటే రజనీకాంతే సూటవుతాడని, తాను హేతువాదినని స్పష్టంచేశారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. తమిళనాడుకు ఇంకా అచ్చే దిన్ రాలేదు. మిగతా రాష్ట్రాలతో నాకు సంబంధం లేదు కానీ.. అచ్చే దిన్ ఎప్పుడొస్తాయి అని కమల్ ప్రశ్నించారు. 
 
ప్రస్తుతం నార్త్, సౌత్ మధ్య ఖచ్చితంగా ఓ విభజన రేఖ కనిపిస్తున్నది. ఢిల్లీకి తమిళనాడు అర్థం కాదు. అలాగే తమిళనాడుకు ఢిల్లీ అర్థం కాదు. ఏ సైడ్ నుంచి కాస్త సానుకూల పరిణామం కనిపించినా.. అవతలి సైడ్ దానిని అనుమానిస్తుంది. అందుకే ఇప్పటివరకు ఏ జాతీయ పార్టీ తమిళనాడులో పాగా వేయలేదు అని కమల్ అభిప్రాయపడ్డాడు. 
 
ఇక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న మరో సూపర్‌స్టార్ రజినీకాంత్ విషయంలోనూ కమల్ స్పందించాడు. అంశాల వారీగా అతనితో కలిసి పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. రజినీతో మాట్లాడుతూనే ఉంటా. అతను నాకు స్నేహితుడు. రాజకీయాల్లోకి రావాలనుకున్నపుడు ముందు అతనికే చెప్పాను. తమిళనాడు గతంలో ఎన్నడూ లేనంత గడ్డు స్థితిలో ఉందని, అందుకే తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు కమల్ స్పష్టంచేశారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డేరా బాబా నా భర్త కాదు.. నాకు తండ్రిలాంటివారు : హనీప్రీత్

డేరా చీఫ్ గుర్మీత్ రాం రహీం సింగ్ తనకు భర్త కాదనీ, తనకు తండ్రిలాంటివారని డేరా బాబా ...

news

ప్రత్యేక పూజల పేరుతో వివాహితపై పూజారి అత్యాచారయత్నం

వ్యాపారంలో వచ్చిన నష్టాలను అధికమించి తిరిగి లాభాలను గడించాలంటే ప్రత్యేక పూజలు చేయాలని ...

news

ఢిల్లీలో హనీప్రీత్ సింగ్: ముందస్తు బెయిల్ కోసం పిటిషన్...

డేరాబాబా కేసులో కీలక నిందితురాలు హనీప్రీత్ నేపాల్‌లో లేదని తేలిపోయింది. అంతేగాకుండా ...

news

రఘు ఇంట్లో తవ్వే కొద్దీ ఆస్తులు.. రూ.500 కోట్ల అక్రమ సంపాదన?

ఏపీ టౌన్‌ ప్లానింగ్‌ డైరెక్టర్‌ గొల్ల వెంకట రఘు అవినీతితో సంపాదించిన ఆస్తులు అందర్నీ ...

Widgets Magazine