శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 18 మే 2017 (08:25 IST)

రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ తథ్యం?... శుక్రవారమే ముహుర్తం... డైలామాలో బీజేపీ

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తన అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగుతున్న రజనీ.. ఈ ఫోటోల కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ కొత్త రాజకీయ పార్టీ పెట్టడం ఖాయమన రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తన అభిమానులతో ఓపిగ్గా ఫోటోలు దిగుతున్న రజనీ.. ఈ ఫోటోల కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. ఈ కార్యక్రమం ముగింపు రోజైన శుక్రవారం సాయంత్రం తన రాజకీయ అరంగేంట్రంపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని తమిళ మీడియా ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. 
 
గతంలో ఆయన పలుమార్లు అభిమానులతో సమావేశమైనా ప్రస్తుత సమావేశాల్లో ఆయన వ్యవహరిస్తున్న తీరు సరికొత్తగా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఆయన వ్యవహారశైలి చూస్తుంటే రాజకీయాల్లోకి రావడం తథ్యమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. జయలలిత మరణం తర్వాత తమిళ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారడంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న ఒత్తిడి పెరిగింది. బీజేపీ, కాంగ్రెస్, డీఎంకేలు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. అయితే రాజకీయ అరంగేట్రం చేయనున్న రజనీకాంత్ సొంతపార్టీ పెట్టాలంటూ అభిమానులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నారు.
 
కానీ, బీజేపీ మాత్రం తమలో ఐక్యం కావాలని రజనీకాంత్‌ను కోరుతోంది. దీనికి రజనీకాంత్ అంగీకరించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అభిమానులతో ఫోటో కార్యక్రమం పెట్టడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఫలితంగా రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై దేశ ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.