Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నాకు తెలుసు.. ఎప్పుడు... రావాలో.. నన్ను ఇబ్బంది పెట్టొద్దండి

శుక్రవారం, 11 ఆగస్టు 2017 (10:36 IST)

Widgets Magazine
rajinikanth - kamalhassan

విశ్వవిఖ్యాత నటుడు కమలహాసన్ రాజకీయ రంగప్రవేశంపై ఆచితూచి అడుగులు వేస్తున్నారు. రజినీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఆలస్యమైతే తానే ముందుకు రాజకీయ కదనరంగంలోకి దూకి తాడోపేడో తేల్చుకుందామని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. కమలహాసన్ రాజకీయ ప్రకటనతో ఒక్కసారిగా తమిళనాడు రాజకీయాల్లో చర్చ ప్రారంభమైంది. ఇద్దరు అగ్రహీరోలు రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు రాష్ట్రం గాడిలో పడే అవకాశం ఉందని భావించారు. రజినీ, కమలహాసన్‌లు కలిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుందనుకున్నారు. ఉన్న పార్టీల పరిస్థితి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు.
 
కమల్ మొదట్లో అనుకున్నా ఆ తర్వాత ఎక్కడ కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు. కమల హాసన్ అభిమాన సంఘం మాత్రం అప్పుడప్పుడూ మా కమల్ రాజకీయాల్లోకి ఇప్పుడొస్తున్నాడు.. అప్పుడొస్తున్నాడు.. అంటూ చెప్పుకుంటూ వచ్చారు. కానీ కమల్ నోరెత్తలేదు. నిన్న డిఎంకే పార్టీకి చెందిన పత్రికా కార్యక్రమంలో పాల్గొన్న కమల్ హాసన్ మీడియాతో ఆశక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
తాను రాజకీయాల్లోకి రావాలనుకునే వాడినైతే 1983 సంవత్సరంలోనే ద్రావిడ మున్నేట్ర కళగం (డిఎంకే) పార్టీలోకి వెళ్ళేవాడినని, దేనికైనా సమయం ఉంటుందని, అంతవరకు ఎవరూ నన్ను ఇబ్బందిపెట్టేలా వ్యవహరించవద్దని చెప్పారు. అంతటితో ఆగలేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి పరిపాలన కోసం తమిళప్రజలు ఎదురుచూస్తున్నారని కూడా చెప్పారట కమల్. ఆయన మాటలు చూస్తుంటే త్వరలోనే ఆయన కూడా రాజకీయాల్లోకి కాలు పెట్టడం దాదాపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌‍కు సహకరించిన ఆర్ఎంపీ వైద్యుడు

డిగ్రీ విద్యార్థినికి అబార్షన్‌కు సహకరించిన ఓ ఆర్ఎంపీ వైద్యుడిని హైదరాబాద్ నగర పోలీసులు ...

news

అత్యంత అరుదైన పింక్ డాల్ఫిన్ (వీడియో)

అత్యంత అరుదుగా కనిపించే పింక్ డాల్ఫిన్‌ ఒకటి అమెరికాలోని లూసియానా సముద్రజలాల్లో ...

news

కన్నకూతురిపై 600 సార్లు అత్యాచారం-626 కేసులు.. 12వేల ఏళ్ల కఠిన కారాగార శిక్ష?

కన్నకూతురిపై 600సార్లకు పైగా లైంగిక దాడికి పడిన కీచక తండ్రికి మలేషియా న్యాయస్థానం 12వేల ...

news

బంగారుతల్లి నీకు అన్యాయం చేసి చనిపోతున్నా... కన్నబిడ్డకు అమ్మ లేఖ

ఓ వివాహిత భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె బలవన్మరణానికి పాల్పడేముందు తన ...

Widgets Magazine