గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 18 ఏప్రియల్ 2020 (16:23 IST)

మే 3 తరువాత ఏం చేద్దాం?.. కేంద్ర మంత్రులతో రాజ్‌నాథ్‌ సింగ్‌ సమాలోచనలు

కోవిడ్‌-19పై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేడు పలువురు సీనియర్‌ మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో కేంద్ర, రాష్ర్టాల మధ్య సమన్వయంపై మంత్రులు సమావేశంలో చర్చించారు.

అదేవిధంగా మే 3వ తేదీన లాక్‌డౌన్‌ ఎత్తివేత అనంతరం ఏ విధంగా ముందుకు వెళ్లాలన్నదానిపై భేటీలో నేతలు చర్చించారు.

సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌, టెక్స్‌టైల్‌ మంత్రి స్మృతి ఇరానీ, పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, రామ్‌ విలాస్‌ పాశ్వన్‌, గిరిరాజ్‌ సింగ్‌, సంతోష్‌ గాంగ్వర్‌, రమేశ్‌ పోక్రియాల్‌, పియూష్‌ గోయల్‌ సమావేశానికి హాజరయ్యారు.

దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ప్రకటించినప్పటి నుంచి మంత్రుల బృందం సమావేశం కావడం ఇది ఐదోసారి. దేశవ్యాప్తంగా నిత్యావసర సరుకులను రవాణాకు, ప్రజలకు అందుతున్న సేవలపై సమావేశ అజెండాలుగా మంత్రులు భేటీలో చర్చించారు.