శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 30 మే 2022 (14:23 IST)

బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై దాడి

rakesh tikait
బెంగుళూరులో రైతు సంఘం నేత రాకేష్ టికాయత్‌పై దాడి జరిగింది. బెంగుళూరులో జరిగిన రైతు సంఘాల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనపై నల్ల సిరాను చల్లి, కుర్చీలతో దాడి చేశారు. ఈ దాడి కూడా రైతు సంఘాలకు చెందిన గిట్టని ఓ వర్గం దాడి చేసినట్టు భావిస్తున్నారు. 
 
నిజానికి గత కొంతకాలంగా టికాయత్ వర్గానికి, చంద్రశేఖర్ వర్గానిక మధ్య విభేదాలు పొడచూపాయి. కావాలనే తనపై కొందరు దాడి చేశారని రాకేశ్ టికాయత్ ఆరోపించారు. అయితే, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. ఈ దాడితో స్థానికంగా కలకలం చెలరేగగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.