Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

న్యాయవాద వృత్తికి క్రిమినల్ లాయర్ గుడ్‌బై...

సోమవారం, 11 సెప్టెంబరు 2017 (10:53 IST)

Widgets Magazine
ram jethmalani

ఏడు పదుల న్యాయవాద వృత్తికి ప్రముఖ క్రిమినల్ న్యాయవాది రాంజెఠ్మలానీ స్వస్తి చెప్పారు. మరో వారం రోజుల్లో 95వ ఏట అడుగుపెడుతున్న తరుణంలో ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా ఆయనను సన్మానించారు. 
 
ఈ సందర్భంగా రామ్‌జఠ్మలానీ తన పదవీ విరమణను ప్రకటించారు. ఈ వారం ప్రారంభంలో ఓ కేసు విచారణ సందర్భంగా ఇది తన చివరి కేసు అని, ఇకపై తాను ఎలాంటి కేసులు వాదించబోనని జఠ్మలానీ సుప్రీంకోర్టుకు తెలిపారు. జఠ్మలానీ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు.. ఆయన ఏడు దశాబ్దాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతున్నారు. ప్రముఖమైన కేసులు ఎన్నింటినో వాదించారు. 
 
సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్‌లో అత్యధిక ఫీజు తీసుకునే న్యాయవాది. న్యాయవాద వృత్తి నుంచి తప్పుకుంటున్నా.. ప్రజాజీవితం నుంచి బయటకు వెళ్లడంలేదని ఆయన ప్రకటించారు. నేను జీవించి ఉన్నంతకాలం రాజకీయాల్లో అవినీతిపై పోరాడుతాను. భారతదేశాన్ని శక్తిమంతమైన, మంచి స్వరూపంలోకి తీసుకొని వస్తానని నమ్ముతున్నాను అని జఠ్మలానీ పేర్కొన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ఇర్మా తుఫాను.. గంటకు 192 కిమీ వేగంతో గాలులు.. ఎటు చూసినా నీరే...

కరేబియన్ దీవులను అతలాకుతలం చేసిన ఇర్మా తుఫాను ఫ్లోరిడాలో తీరందాటింది. ఫ్లోరిడా పశ్చిమ ...

news

ఇర్మా తుఫాను... సముద్రపు అలలను వీడియో తీస్తూ... (Video)

అమెరికాలోని ఫ్లోరిడా నగరాన్ని ఇర్మా తుఫాను ముంచెత్తింది. ఈ విధ్వంస‌క‌ర‌, భ‌యంక‌ర తుఫాను ...

news

పురిటినొప్పుల్ని తట్టుకోలేక ఐదో అంతస్థు నుంచి దూకేసింది.. (వీడియో)

పురిటినొప్పులను తట్టుకోలేక సిజేరియన్ చేయాల్సిందిగా వేడుకుంది. అయితే తల్లిదండ్రులు ఆమె ...

news

12వ అంతస్తు నుంచి దూకి మ్యూజీషియన్ సూసైడ్...

బెంగళూరుకు చెందిన 29 యేళ్ళ మ్యూజీషియన్ కరణ్ జోసెఫ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ముంబైలోని ...

Widgets Magazine