1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (17:24 IST)

రామ్ కుమార్ కుటుంబానికి కోటి రూపాయలిస్తారా? ప్రభుత్వ ఉద్యోగం కూడానా?

స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కుంటూ.. పోలీసులచే అరెస్టయి పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్ కుటుబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని తమిళ రాష్ట్రానికి చెందిన కొన్ని మానవ హక్

స్వాతి హత్య కేసులో నిందితుడని ఆరోపణలు ఎదుర్కుంటూ.. పోలీసులచే అరెస్టయి పుళల్ జైలులో ఆత్మహత్యకు పాల్పడిన రామ్ కుమార్ కుటుబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని తమిళ రాష్ట్రానికి చెందిన కొన్ని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రామ్ కుమార్ మరణం హత్యా లేకుంటే ఆత్మహత్యా అనేది ఇంకా తేలాల్సి వున్న నేపథ్యంలో.. స్వాతి హత్య కేసులో అతడు నిర్దోషి అని తేలిన పక్షంలో అతని కుటుంబానికి అమ్మ సర్కారు కోటి రూపాయల నష్టపరిహారాన్ని అందజేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 
ఇంకా రామ్ కుమార్ మరణం పట్ల గల సస్పెన్స్ వీడాలంటే సీబీఐ విచారణ జరపాలని, కోటి రూపాయల నష్ట పరిహారం అందజేయాలని.. ఈ రెండింటితో పాటు రామ్ కుమార్ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని హెచ్చార్సీ అధికారులు డిమాండ్ చేస్తున్నారు.

పనిలో పనిగా స్వాతి మర్డర్ కేసులో అసలైన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి శిక్షపడేలా చూడాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తూ.. ఆందోళన చేపట్టాయి. పోలీసుల ఎఫ్ఐఆర్‌లో మాత్రం రామ్ కుమార్ స్విచ్ బోర్డులోని విద్యుత్‌ తీగను నోటబెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు నమోదు చేశారు.