సాక్ష్యం చెప్పకుండా అత్యాచార బాధితురాలికి విషం తాగించారు...  
                                       
                  
                  				  ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ రేప్ కేసులో సాక్ష్యం చెప్పకుండా ఉండేందుకు అత్యాచార బాధితురాలికి ఇద్దరు యువకులు విషం తాగించారు. ఢిల్లీలోని ద్వారకా జిల్లా హస్తసాల్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
				  											
																													
									  
	 
	హస్తసాల్ ప్రాంతానికి చెందిన 17 యేళ్ళ యువతి ఓ అత్యాచార కేసులో ప్రధాన సాక్షి. ఈమె గత గురువారం ట్యూషన్‌కి వెళ్లి వస్తుండగా, ఇద్దరు యువకులు అడ్డగించి బలవంతంగా కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత కోర్టులో నిందితుడిపై సాక్ష్యం చెప్పొద్దంటూ ప్రాధేయపడ్డారు. అందుకు ఆమె నిరాకరించింది. 
				  
	 
	దీంతో ఆమెతో బలవంతంగా విషం తాగించి, అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలు స్పృహకోల్పోయి కిందపడింది. దీన్ని గమనించిన గమనించిన స్థానికులు ఓ ఆటో రిక్షాలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమయానికి ఆస్పత్రికి తరలించడంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. 
				  																								
	 
 
 
  
	
	
																		
									  
	 
	శుక్రవారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఇద్దరు వ్యక్తులపై ఉత్తమ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ ఇద్దరు నిందితులు అత్యాచారం కేసులో ఇటీవలే బెయిలుపై విడుదలయ్యారు.