శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (22:25 IST)

సెక్స్ వర్కర్ కూతురు కల సాకారం అయ్యింది... న్యూయార్క్ వర్శిటీలో సీటు.. ఎందుకో తెలుసా?

కష్టాలు మానవజీవితంలో సహజమైపోయాయి. ధనవంతుడికి, మధ్యతరగతికి, పేదవారికి వారి వారి స్థాయిలకు తగ్గట్టు ఏదో ఒక కష్టం తప్పట్లేదు. కానీ ఈ మూడు వర్గాల కంటే దారిద్ర్య రేఖకు కిందనున్న ప్రజల జీవితం మరింత దుర్భరంగ

కష్టాలు మానవజీవితంలో సహజమైపోయాయి. ధనవంతుడికి, మధ్యతరగతికి, పేదవారికి వారి వారి స్థాయిలకు తగ్గట్టు ఏదో ఒక కష్టం తప్పట్లేదు. కానీ ఈ మూడు వర్గాల కంటే దారిద్ర్య రేఖకు కిందనున్న ప్రజల జీవితం మరింత దుర్భరంగా మారిపోతుంది. ఈ నేపథ్యంలో జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న ఓ బాలిక.. అంచెలంచెలుగా పైకెదిగి.. న్యూయార్క్ వర్శిటీలో సీటు కొట్టేసింది.
 
వివరాల్లోకి వెళితే.. ముంబైలో ఓ సెక్స్ వర్కర్ కడుపున పుట్టింది అశ్విని. సెక్స్ వర్కర్ అయిన ఆమె తల్లి ఎన్నో కష్టాలు పడి.. ఎంతో క్రమశిక్షణగా అశ్వినిని పెంచింది. చిన్న తప్పు చేసినా బెత్తం దెబ్బలు తప్పవు. ఈ క్రమంలో అశ్వినికి ఆమె తల్లి గతంలో లిప్‌స్టిక్ పోగొట్టిందని ఎర్రటి వాతలు పెట్టింది. రోడ్లో ఆడుతుంటే చితకబాదేది. ఇలా తల్లి చేతిలో ఇలాంటి శిక్షలు అనుభవించక ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అశ్వినిని.. మళ్లీ ఆమె తల్లి పట్టుకుని ఓ ఎన్జీవో హాస్టల్‌లో చేరింది. అక్కడైనా ఆమెకు ఇక్కట్లు తప్పలేదు. ఎన్నో అవమానాలు భరించింది. ఆ సంస్థలో క్రమశిక్షణ తప్పితే రోజుల తరబడి తిండిపెట్టకుండా పస్తులు ఉంచేవారని అశ్విని చెప్పుకొచ్చింది.
 
ఇదే సమయంలో అశ్విని తల్లి చనిపోవడంతో అదే హాస్టళ్లో పదేళ్ల పాటు ఎన్నో కష్టాలు అనుభవించానని చెప్పింది. ఒక రోజు తన స్నేహితులతో కలిసి హాస్టల్ నుంచి అశ్విని క్రాంతి అనే ప్రాంతానికి పారిపోయింది. అనాథలైన అమ్మాయిలను అక్కడ చేరదీస్తారని ఎవరో చెప్పడంతో అక్కడికి వెళ్లినట్లు అశ్విని చెప్పింది.
 
అక్కడే ఉంటూ డాన్స్‌, ఆర్ట్, థెరపీలను నేర్చుకున్నట్లు చెప్పింది. ఈ విద్యతో క్యాన్సర్ బాధిత పిల్లలకు కౌన్సిలింగ్ ఇచ్చింది. వారిలో నమ్మకాన్ని నింపింది. ఇలా రెండేళ్లుగా దేశంలో పలు నగరాల్లో పర్యటించి ఫోటోగ్రఫీ, థియేటర్ ఆర్ట్స్‌, ఎన్జీఓల్లో వాలంటీర్‌గా పనిచేసి అనుభవం గడించినట్లు అశ్విని పేర్కొంది.
 
తాజాగా ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్న ప్రజలకు సేవచేయాలన్న ఆలోచనతో ఆమె న్యూయార్క్ యూనివర్శిటీకి దరఖాస్తు చేయగా అక్కడ సీటు లభించింది. స్కాలర్‌షిప్ ఇస్తామని ఆ యూనివర్శిటీ అశ్వినీకి భరోసా ఇచ్చింది. స్కాలర్‌షిప్ ట్యూషన్ ఫీజుకు సరిపోతుంది. కానీ అక్కడ ఉండేందుకు హాస్టల్ ఫీజు, తిండికి సుమారు పది లక్షల రూపాయలు ఖర్చు చేసింది. దీంతో ఏమి చేయాలో తెలియక హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజ్ అనే సంస్థను సంప్రదించింది. 
 
ఈ సంస్థ ఫేస్ బుక్ పేజీపై అశ్విని గాథను రాశారు. అంతే ఇప్పటి వరకు ఆ పోస్టుకు 16వేల లైకులు 1200 షేర్లు రావడంతో రూ.9,47,083ల మొత్తం చేతికందింది. తద్వారా ఆమెకు కావాల్సిన డబ్బు దాదాపుగా సమకూరింది. ఇక అశ్విని తన కలను సాకారం చేసుకోనున్నట్లు చాలా సంతోషంగా చెప్పింది. తనకు సహకరించిన హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజ్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపింది.