సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 19 జూన్ 2021 (13:03 IST)

పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల పునరుద్ధరణ

ఇటీవల రద్దయిన పలు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు దక్షిణరైల్వే ప్రకటిం చింది. ఈ మేరకు దక్షిణరైల్వే చీఫ్‌ పీఆర్వో బి.గుగనేశన్‌ ప్రకటన విడుదల చేశారు. ఆ వివరాలిలా వున్నాయి...
 
రేపటి నుంచి పునరుద్ధరించిన ఎక్స్‌ప్రెస్‌లు..
ఎగ్మూర్‌ - తంజావూర్‌ (06865) ఎగ్మూర్‌ - కొల్లం (06101) చెన్నై సెంట్రల్‌ - తిరువనంతపురం (02695)  చెన్నై సెంట్రల్‌ - అళప్పుళ (02639) చెన్నై సెంట్రల్‌ - మేట్టుపాళయం (02671) ఎగ్మూర్‌ - రామేశ్వరం (06852) 7.తిరుచ్చి - ఎగ్మూర్‌ (02654)
 
21 నుంచి పునరుద్ధరించిన రైళ్లు
తంజావూర్‌ - ఎగ్మూర్‌ (06866) కొల్లం - ఎగ్మూర్‌ (06102) తిరువనంతపురం - చెన్నై సెంట్రల్‌ (02695)  అళప్పుళ - చెన్నై సెంట్రల్‌ (0264) మేట్టుపాళయం - చెన్నై సెంట్రల్‌ (02672) రామేశ్వరం - ఎగ్మూర్‌ (06852) ఎగ్మూర్‌ - తిరుచ్చి (02653)
 
 
గోరఖ్‌పూర్‌-ఎర్నాకుళం ప్రత్యేక రైలు
గోరఖ్‌పూర్‌-ఎర్నాకుళంగోరఖ్‌పూర్‌ (నెం.05303/ 05304) ప్రత్యేక రైళ్లు ఈ నెల 19 నుంచి ప్రారంభం కాను న్నాయి. గోరఖ్‌పూర్‌-ఎర్నాకుళం ప్రత్యేక రైలు ఈ నెల 19, 26 (శనివారం) తేదీల్లో ఉదయం 8.30 గంటలకు గోరఖ్‌పూర్‌లో బయల్దేరి మూడో రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు ఎర్నాకుళం చేరుకుంటుంది.

అలాగే, ఎర్నా కుళం-గోరఖ్‌పూర్‌ ప్రత్యేక రైలు ఈ నెల 21, 28 (సోమవారం) రాత్రి 11.55 గంటలకు ఎర్నాకుళంలో బయల్దేరి నాలుగో రోజు ఉదయం 6.30 గంటలకు గోరఖ్‌పూర్‌ చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఖలీలాబాద్‌, బస్తి, గోండ, బారాబంకి, ఆశిష్‌బాగ్‌, కాన్పూర్‌ సెంట్రల్‌, ఓరాయ్‌, ఝాన్సీ, బిన, భోపాల్‌, ఇటార్సి, జుజ్‌హార్‌పూర్‌, బల్హార్షా, వరంగల్‌, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూర్‌, గూడూరు, పెరంబూర్‌, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్‌, ఓట్టపాళం, షోలానూర్‌ ‘బి’, త్రిశూర్‌, అలువ స్టేషన్లలో ఆగనున్నాయి.

ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్‌ శనివారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.