మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 29 జూన్ 2023 (22:16 IST)

కేరళలో దారుణం.. వధువు తండ్రి హతం.. పిల్లనివ్వలేదని..?

కేరళలో దారుణం జరిగింది. పెళ్లి ఇంట విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి ముందు రోజు రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. వధువు తండ్రిని పక్కింటి యువకుడు తన సోదరుడు, స్నేహితులతో కలిసి తీవ్రంగా దాడి చేసి హతమార్చాడు. తన కుమార్తెను ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించలేదన్న కక్షతోనే అతడు ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు మృతుడి బంధువులు తెలిపారు. 
 
తిరువనంతపురం జిల్లాలోని కల్లంబలంకు చెందిన రాజు(61) కుమార్తె వివాహం బుధవారం ఉదయం జరగాల్సి ఉంది. మంగళవారం రాత్రి అతడి పక్కింట్లో నివసించే జిష్ణు వధువు తండ్రితో గొడవకు దిగి ఆయనపై దాడి చేసి హతమార్చాడు.
 
నిందితుడికి నేరచరిత్ర ఉందని.. అందుకే రాజు తన కుమార్తెను అతడికి ఇచ్చి వివాహం చేసేందుకు అంగీకరించలేదని మృతుడి బంధువు ఒకరు తెలిపారు. నలుగురు నిందితులనూ పోలీసులు అరెస్ట్‌ చేశారు.