శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (19:11 IST)

శశికళకు మద్దతిస్తాం.. తిరునావుక్కరసు ప్రకటనపై కాంగ్ ఎమ్మెల్యేల ఫైర్

తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో.. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశికళకు మద్దతు ప్రకటించడాన్ని ఆ పార్టీకి చెందిన ఎంఏల్ఏలు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్

తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో.. తమిళనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశికళకు మద్దతు ప్రకటించడాన్ని ఆ పార్టీకి చెందిన ఎంఏల్ఏలు వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది సభ్యులు ఉన్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డీఎంకేతో కలిసి పోటీచేసింది. ఈ ఎన్నికల్లో డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది మంది ఎంఏల్ఏలు ఈ కూటమి సభ్యులుగా ఉన్నారు.
 
అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళలు ముఖ్యమంత్రి పదవి కోసం పావులు కదుపుతున్నారు. అన్నాడీఎంకేలో శశికళ, పన్నీర్ సెల్వంలు గ్రూపులుగా విడిపోయారు. ఎంఏల్ఏలు, నాయకులు కూడ రెండుగ్రూపులుగా విడిపోయారు. అయితే ఈ పరిస్థితుల్లో అన్నాడిఎంకె ప్రధాన కార్యరద్శి శశికళకే తాము మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ తిరునవుక్కరసు బహిరంగంగా ప్రకటన చేశారు. ఈ ప్రకటన పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు విభేధిస్తున్నారు.
 
ఇదిలా ఉంటే.. తమిళనాడు రాజకీయాలపై తమకు ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు అందలేదని కేంద్రం స్పష్టం చేసింది. గురువారం గవర్నర్ విద్యాసాగర్‌రావును ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, సీఎం పీఠం ఎక్కేందుకు సిద్ధమవుతున్న శశికళను వేర్వేరుగా కలిశారు. వారి వాదనలు విన్న గవర్నర్ ఎటువంటి నిర్ణయం వెలువరించలేదు.