శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 డిశెంబరు 2017 (08:18 IST)

ఆర్.కె నగర్ బై పోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభం...

దేశవ్యాప్తంగా ఎంతో ఆస‌క్తి రేకెత్తించిన చెన్నై, ఆర్.కె.నగర్‌ ఉపఎన్నిక ఫ‌లితం మ‌రికాసేప‌ట్లో తేల‌నుంది. ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

దేశవ్యాప్తంగా ఎంతో ఆస‌క్తి రేకెత్తించిన చెన్నై, ఆర్.కె.నగర్‌ ఉపఎన్నిక ఫ‌లితం మ‌రికాసేప‌ట్లో తేల‌నుంది. ఆదివారం ఉద‌యం 8 గంట‌ల‌కు ఓట్ల లెక్కింపు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది. మొత్తం 100 మంది అధికారుల ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొన‌సాగుతోంది. మొత్తం 19 రౌండ్లలో ఓట్లను లెక్కించనున్నారు. మధ్యాహ్నానికి తుది ఫలితం వెల్లడికానుంది. లెక్కింపునకు 14 బెంచీలు సిద్ధం చేశారు. 
 
ఒక్కో బెంచీకి ముగ్గురు లెక్కింపు అధికారులు, ఒక మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. మొదటి రౌండ్‌ లెక్కింపు పూర్తి అయిన తర్వాత సరిచూసుకుని స్పీకర్లలో తెలియజేస్తారు. అనంతరం రెండో రౌండ్‌కు వెళుతారు. ఈ క్రమాన్ని మొత్తం రికార్డు చేస్తారు. లెక్కింపు కేంద్రానికి గుర్తింపు పొందిన వారిని మాత్రమే అనుమతిస్తారు.
 
కాగా, ఈ నెల 21వ తేదీన జరిగిన ఉప ఎన్నిక పోలింగ్‌లో మొత్తం 1.77 లక్షల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో పోలింగ్‌ నమోదు కావడంతో గెలుపు ఎవరిదన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. మొత్తం 59 మంది అభ్యర్థులు ఈ ఫలితం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే అభ్యర్థి ఇ.మధుసూదన్‌, డీఎంకే అభ్యర్థి మరుదుగణేష్‌, స్వతంత్ర అభ్యర్థి టీటీవీ దినకరన్‌ల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఈ ముగ్గురితో సహా మొత్తం 59 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేశారు.