1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (08:53 IST)

ప్రముఖ పర్యావరణవేత్త ఆర్కే. పచౌరీ ఇకలేరు...

నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ పర్యావరణవేత్త ఆర్కే. పచౌరీ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గతరాత్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 79 యేళ్లు. 
 
హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని ఫోర్టిస్ ఎస్కార్ట్ హార్ట్ ఇనిస్టిట్యూట్‌లో చికిత్స పొందుతున్నారు. గతేడాది జులైలో గుండెపోటుకు గురైన ఆయనకు ఇదే ఆసుపత్రిలో ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా అయింది.
 
పచౌరీ నేతృత్వంలోని ఐపీసీసీ నోబెల్ బహుమతి అందుకుంది. మానవ నిర్మిత వాతావరణ మార్పునకు సంబంధించిన అవగాహన పెంపొందించడానికి, వ్యాప్తి చేయడానికి, దానిని ఎదుర్కోవడానికి అవసరమైన చర్యలకు విశేష కృషి చేసిందుకుగాను ఈ అవార్డు లభించింది. 
 
అలాగే, న్యూఢిల్లీలోని ‘ది ఎనర్జీ అండ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ (తేరి) వ్యవస్థాపక అధ్యక్షుడైన పచౌరీ ఐక్యరాజ్యసమితి ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఆన్ క్లైమేట్ చేంజ్ (ఐపీసీసీ)కి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆ తర్వాత తేరి డైరెక్టర్ పదవీ బాధ్యతల నుంచి పచౌరీ తప్పుకున్నారు.