శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: మంగళవారం, 2 జూన్ 2020 (13:51 IST)

రూ. 1548 కోట్లతో కేరళ ప్రభుత్వం హైస్పీడ్ ఇంటర్నెట్

కేరళ ప్రభుత్వము 1548 కోట్ల వ్యయంతో హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని పేదరికంలో వున్న 20 లక్షల మంది కుటుంబాలకు అందించనుంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ. 1548 కోట్లు ఖర్చు కానుంది. గడచిన నెలల్లో కోవిడ్ 19 కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
 
మరే రాష్ట్రంలోను ఇంతటి సౌకర్యాన్ని అందించలేదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. దీనివల్ల దారిద్ర్య రేఖకు దిగువనున్న ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరుతుందని సూచించారు. కేవలం పేదలకే కాకుండా ఇతరులకు కూడా ఈ సౌకర్యాన్ని తగు ధరలకు అందించనున్నట్లు తెలిపారు.
 
ఈ సదుపాయం వల్ల ప్రభుత్వ పాఠశాలలు, ఆరోగ్య సంస్థలు లబ్ది పొందుతాయి. ఈ ప్రాజెక్టు కేరళ ప్రభుత్వ ఆధీనంలో వుండనుంది. హైస్పీడ్ ఇంటర్నెట్ వల్ల కోవిడ్ 19 విజృంభిస్తున్న వేళ కేరళ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా వుంటుందని విజయన్ చెప్పారు.