శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

రూ. 125 నాణెం విడుదల

కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ 125 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. ఈ ఏడాది పరమ హంస యోగానంద 125 వ జయంతి కావడంతో ప్రభుత్వం ఆయన స్మారకార్థం ఈ నాణెం విడుదల చేసింది.

నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ పరమహంస యోగాతో ఎన్నో అద్భుతాలు చేశారని అన్నారు. ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తుగా ప్రభుత్వం 125 రూపాయల నాణెం విడుదల చేస్తోందని చెప్పారు.

1893 లో జన్మించిన పరమహంస 1952 లో కన్నుమూశారు. ఆయన క్రియా యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా పాల్గొన్నారు.