శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 28 నవంబరు 2016 (12:56 IST)

బీజేపీ నేత కారులో రూ.18.5 లక్షల కొత్త కరెన్సీ నోట్లు స్వాధీనం

తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు చెందిన ఓ నేత కారులో రూ.18.5 లక్షల కొత్త కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోటుతో పాటు రూ

తమిళనాడు రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు చెందిన ఓ నేత కారులో రూ.18.5 లక్షల కొత్త కరెన్సీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కొత్తగా విడుదల చేసిన రూ.2000 నోటుతో పాటు రూ.100 నోట్లుగా ఉండటం గమనార్హం. 
 
సేలం నగర పాలక సంస్థ పరిధిలో నేర నిరోధక విభాగం పోలీసులు జిల్లా కేంద్రంలో ఆదివారం రాత్రి వాహన తనిఖీల్లో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో సేలంలోని కుమారసామిపట్టి వద్ద వేగంగా వెళుతున్న ఓ లగ్జరీ కారును నిలిపి సోదా చేశారు. ఆ కారులో ఉన్న బీజేపీ యువజన విభాగం నాయకుడు అరుణ్‌రామ్‌, అతడి స్నేహితుడు భువనేశ్ వద్ద విచారణ జరిపారు. 
 
ఆ కారులో ఉన్న పెద్ద ప్లాస్టిక్‌ బ్యాగ్‌ను తెరచి చూడగా అందులో కొత్త రెండు వేల రూపాయల నోట్ల కట్టలు, వంద రూపాయల నోట్ల కట్టలు సహా మొత్తం రూ.18.5 లక్షల నగదు లభించింది. చిన్న తిరుపతి నుంచి సేలంకు తరలిస్తున్న ఆ నగదు తమకు చెందినవేనని అరుణ్‌రామ్‌ తెలిపాడు. అయితే సరైన దస్తావేజులు లేకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదును అక్కడి ట్రెజరీలో భద్రపరిచేందుకు వీలుకాకపోవటంతో కలెక్టర్‌ కార్యాలయం వద్ద భద్రపరిచారు.