నల్లకుబేరులకు ప్రధాని మోదీ షాక్... రూ.500, రూ.1000 నోట్లు రద్దు
నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేరుకోలేని షాకిచ్చారు. నల్లధనం అరికట్టేందుకు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రద్దు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని త
నల్లకుబేరులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేరుకోలేని షాకిచ్చారు. నల్లధనం అరికట్టేందుకు చేపట్టిన కఠిన చర్యల్లో భాగంగా ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రద్దు మంగళవారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపారు.
మంగళవారం జాతినుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. ఇందులో ఆయన నల్లధనం అరికట్టేందుకు చేపట్టిన చర్యలను వివరించారు. ప్రస్తుతం చెలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేసమయంలో మన వద్ద ఉన్న నోట్లను డిసెంబర్ 31వ తేదీలోపు బ్యాంకులు, పోస్టాఫీసుల్లో డిపాజిట్ చేసుకోవచ్చని, వీటికి ఎలాంటి అదనపు రుసుంలు వసూలు చేయరని చెప్పారు.
ఈ డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే సమయంలో తమ గుర్తింపు కార్డును విధిగా చూపించాల్సి ఉంటుందని ఆయన ప్రకటించారు. అలాగే, బ్యాంకుల నుంచి ఒక రోజుకు రూ.10 వేలకు మించి, వారానికి రూ.20 వేలకు మించి డబ్బులు డ్రా చేయడానికి వీల్లేదని చెప్పారు.