1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 30 ఆగస్టు 2015 (10:36 IST)

భారత్‌ ఇస్లామ్‌ దేశమవుతుందా?: ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన

భారత్ ఇస్లామ్ దేశమవుతుందా అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల వెల్లడైన జనాభా గణనలో ముస్లింల సంఖ్య పెరిగినట్టు తేలింది. దీనిపై ఆర్ఎస్ఎస్ తన ఇంగ్లీషు పత్రిక ఆర్గనైజర్‌ తాజా సంచికలో మతపరమైన జనాభా లెక్కలపై సంపాదకీయాన్ని ప్రచురించింది.
 
సిక్కులు, బౌద్ధుల జనాభా తగ్గడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ ఆందోళన వ్యక్తంచేసింది. దేశీయ మతస్థుల సంఖ్య తగ్గినప్పుడల్లా వేర్పాటు ధోరణులు పెచ్చరిల్లుతాయనీ, వీటిని సరిచేసేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ తన సంపాదకీయంలో సూచించింది. 
 
ఇంకోవైపు... హిందువులు పిల్లల సంఖ్యను పెంచాలని శివసేన పిలుపునిచ్చింది. ఐదుగురు పిల్లలు ఉన్న.. కనే తల్లిదండ్రులకు రూ.5 లక్షలు బహుమతి ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ప్రతి ఒక్క హిందువు సహకరించాలని పిలుపునిచ్చింది.