శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 12 డిశెంబరు 2023 (14:42 IST)

శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై దాడి.. (Video)

ayyappa devotee
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా శ్రీరంగంలో ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయంలో తెలుగు అయ్యప్ప భక్తులపై మంగళవారం ఉదయం దాడి జరిగింది. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులపై ఆలయ భద్రతా సిబ్బంది దాడి చేశారు. దీంతో ఆలయంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. క్యూలైన్లలో ఉన్న అయ్యప్ప భక్తుకు, ఆలయ భద్రతా సిబ్బంది మధ్య గొడవ జరిగింది. ఇది తీవ్ర వాగ్విదానికి దారితీయడంతో భక్తులపై ఆలయ సిబ్బంది దాడి చేశారు. చేతికి అందిన వస్తువలతో కొట్టడంతో ఏపీకి చెందిన భక్తుల్లో పలువురికి రక్తపు గాయాలయ్యాయి. ఈ ఘటనపై తీవ్ర గాయాలపాలైన ఇద్దరు ఏపీ అయ్యప్ప భక్తులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. 
 
ఈ ఘటనపై ఏపీ భక్తులు క్యూలైన్లలోనే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆలయ భద్రతా సిబ్బంది (పోలీసులు)కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో స్వామివారి దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. స్థానిక పోలీసులు ఆలయంలోకి చేరుకోవడంతో భద్రతా సిబ్బందిపై ఏపీ భక్తులు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలతో పాటు ఏపీ భక్తుల ఆందోళనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడిలో ఐదుగురు అయ్యప్ప భక్తులు గాయపడ్డారు.