1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 16 డిశెంబరు 2019 (13:12 IST)

శబరిమల ఆదాయం భారీగా పెరిగింది.. కారణం అదే..?

సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయం శబరిమలకు ఈసారి కానుకలు వెల్లువెత్తాయి. శబరి ఆలయానికి ఈసారి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కానుకలు కూడా పెద్ద ఎత్తున సమర్పిస్తున్నారు. దీంతో శబరిమల ఆలయపు ఆదాయం భారీగా పెరిగింది. 
 
శబరిమల అయ్యప్పస్వామి భక్తుల కోర్కెలు తీర్చే దేవుడిగానే కాదు, ఆదాయార్జనలోనూ మేటిగా నిలిచాడు. ఈ సీజన్‌లో ఆలయం తెరిచిన 28 రోజుల్లోనే రూ.100 కోట్ల ఆదాయం స్వామివారి ఖాతాలో చేరింది. గత సీజన్‌లో ఇదే సమయానికి అయ్యప్ప ఆదాయం కేవలం రూ.64 కోట్లే. ఈసారి అది మరింత పెరిగింది.
 
ఇకపోతే... ఈ ఏడాది నవంబరు 17న ఆలయం తెరుచుకోగా, సరిగ్గా ఆదివారం సమయానికి దేవస్థానం ఆదాయం రూ.104.72 కోట్లకు చేరింది. గతేడాది మహిళల ప్రవేశం కారణంగా ఉద్రిక్త పరిస్థితుల చోటుచేసుకున్నాయి. దాంతో, భక్తుల సంఖ్య తగ్గడంతో దాని ప్రభావం ఆదాయంపైనా పడింది. అయితే ఈ ఏడాది ఆదాయం బాగా పెరిగిందని ఆలయ నిర్వాహకులు తెలిపారు.