గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 14 నవంబరు 2024 (19:19 IST)

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ కారు డ్రైవర్ నెల వేతనం ఎంతో తెలుసా?

car driving
రిలయన్స్ అధినేత, భారతదేశ కుబేరుడు ముకేశ్ అంబానీ ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరిగా ఉన్నారు. ఆయనకు ఏకంగా రూ.8.5 లక్షల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. దీంతో ఆయన ఎక్కడకు వెళ్లినా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అలాంటి ముకేశ్ అంబానీకి కారు డ్రైవర్‌గా పని చేసే ఉద్యోగి వేతనంపై ఇపుడు జాతీయ మీడియాలో ప్రత్యేకంగా ఓ కథనం వచ్చింది. నిజానికి ఈ వివరాలు అత్యంత రహస్యంగా ఉంటాయి. అయితే, జాతీయ మీడియా పేర్కొన్న కథనాల మేరకు.. 
 
గత 2017 నాటి లెక్కల ప్రకారం ముకేశ్ అంబానీ తన కారు డ్రైవర్‌కు వేతనంగా నెలకు రూ.2 లక్షలు చెల్లించినట్టు సమాచారం. ప్రపంచంలో అత్యంత సంపన్నుల్లో 17వ స్థానంలో ముకేశ్ అంబానీ ఉన్నారు. దీంతో ఆయన కార్లకు పనిచేసే డ్రైవర్లకు కూడా అదే స్థాయిలో వేతనాలు ఉంటాయి. అయితే 2024లో ఈ వేతనాలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇపుడు కనీసం రూ.4 లక్షల మేరకు నెలవేతనం ఉండొచ్చని, అంటే యేడాది మొత్తంగా చూస్తే రూ.48 లక్షల వరకు వేతనం ఉండొచ్చని జాతీయ మీడియా కథనం పేర్కొంది. 
 
అయితే, అంబానీ ప్రయాణించే కార్లకు డ్రైవర్‌గా ఉండాలంటే ఏదేని ప్రమాదం సంభవిస్తే చివరకు ప్రాణలను సైతం అడ్డుపెట్టిన తమ యజమానికి రక్షించాల్సి వుంటుంది. అలాంటి వారిని మాత్రమే డ్రైవర్లుగా ఎంపిక చేస్తారు. మిలిటరీ స్థాయిలో డ్రైవింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఉంటుంది. ఒక సైనికుడి తరహాలో ఫిట్నెస్ ఉంటుంది.