Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ అంత ఖర్చు చేసిందా? ఎమ్మెల్యేలకు రూ.6కోట్లు.. స్టింగ్ ఆపరేషన్‌పై విపక్షాల ఫైర్..

మంగళవారం, 13 జూన్ 2017 (12:32 IST)

Widgets Magazine

దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తర్వాత ఆమె స్థానాన్ని కైవసం చేసుకునేందుకు చిన్నమ్మ శశికళ విశ్వప్రయత్నాలు చేసింది. అయితే చిన్నమ్మ ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు. అక్రమాస్తుల కేసులో చిక్కుకున్న చిన్నమ్మ ప్రస్తుతం పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తోంది. ఈ మధ్య దినకరన్ కూడా అరెస్టు కావడంతో.. అమ్మ పార్టీలోని వర్గాలన్నీ ఏకమవుతాయని ప్రజలు అనుకున్నారు. కానీ అది జరగలేదు.
 
ఈ నేపథ్యంలో చిన్నమ్మ పన్నీర్ సెల్వంను సీఎం కుర్చీ నుంచి  దింపేందుకు దాదాపు వెయ్యి కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తేలింది. తాజాగా ఓ ఛానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్‌లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.6కోట్లు ఇచ్చేందుకు చిన్నమ్మ అంగీకరించినట్లు ఆ పార్టీ ఎమ్మెల్యే ఒకరు తెలిపారు. చిన్నమ్మ అంత మొత్తంలో డబ్బులివ్వనున్నట్లు చెప్పడంతోనే ఆమెను అనుకూలంగా ఓటేసినట్లు సదరు ఎమ్మెల్యే మాటలను బట్టి తేలిపోయింది. నోట్లరద్దుతో కరెన్సీకి ఇబ్బందిగా వుండడంతో కొంతమొత్తాన్ని బంగారం రూపంలో ఇచ్చినట్టు కూడా ఎమ్మెల్యే చెప్పారు. 
 
చిన్నమ్మ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతిచ్చేందుకు ఏకంగా 15 రోజుల పాటు చెన్నై శివారులోని కూవత్తూరు రిసార్టులో  కొలువుదీరారు. ఓ ఇంగ్లీష్, తమిళ ఛానల్స్ సంయుక్తంగా నిర్వహించిన స్టింగ్‌ ఆపరేషన్‌లో మదురై దక్షిణ ఎమ్మెల్యే శరవణన్‌ ఈ వివరాలను వెల్లడించారు. అయితే ఈ స్టింగ్ ఆపరేషన్‌పై పళని వర్గం మండిపడుతోంది. ఇది బూటకమంటోంది.
 
ఎమ్మెల్యేలకు పైసా కూడా ఇవ్వలేదని.. తమ ప్రభుత్వంపై బురద చల్లేందుకే పన్నీర్ వర్గం ఇలా చేస్తుందని ఆరోపించింది. కానీ ఈ స్టింగ్ ఆపరేషన్‌పై విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ స్టింగ్ ఆపరేషన్‌పై దర్యాప్తు జరపాలని.. వెంటనే అసెంబ్లీని సమావేశపరచాలని డీఎంకే పట్టుబడుతోంది. బలపరీక్ష సమయంలోనూ పళనిసామి టీమ్ దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని డీఎంకే నేతలు గుర్తు చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

ప్రేమించానని.. ఒకరోజు రాత్రంతా గడిపి.. ఆ తరువాత(వీడియో)

ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సాధారణమైపోయింది. ఒకరు ఇద్దరు కాదు. ఎంతోమంది అమ్మాయిలు ...

news

డయానా పెళ్లైన పది రోజుల్లోనే ఆ పని చేసిందా? పెళ్లైన ఏడాదిలోనే మృతి.. వీడని మిస్టరీ...

బ్రిటన్ యువరాణి డయానాకు సంబంధించిన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 1996 ఆగస్టు 28న ...

news

తిరుమల కొండల్లో చిన్నారి హత్య.. నాలుగేళ్ల చిట్టితల్లిని చెట్టుకు కట్టేసి.. సవతి తల్లి..?

పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో దారుణం జరిగింది. నాలుగేళ్ల బాలికను సవతితల్లి కిరాతకంగా ...

news

అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలకు నో బ్రేక్: ఇక విలీన చర్చల్లేవని ప్రకటించిన పన్నీర్ సెల్వం

అధికార అన్నాడీఎంకేలో వర్గ రాజకీయాలు ముదిరిపాకాన పడ్డాయి. పార్టీలో ఆధిపత్య పోరుకు నాయకులు ...

Widgets Magazine