Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పన్నీర్‌కే సంపూర్ణ మద్దతు.. అసలు సీన్ ఇకపైనే.. ఓపీఎస్ బల నిరూపణ ఉంటుందా? ఏం జరుగుతుంది?

మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (11:28 IST)

Widgets Magazine

అక్రమాస్తుల కేసులో మంగళవారం ఉదయం తీర్పు వెలువరించిన సుప్రీం కోర్టు.. శశికళను దోషిగా ప్రకటించడంతో ప్రస్తుతం ఆమె ముందు గాఢాంధకారం అలుముకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళకు వ్యతిరేకంగా ప్రజలు తీవ్ర నిరసనలు, వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. అలాగే, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు కూడా ఈ వ్యతిరేక సెగ తాకుతోంది.
 
ఈ నేపథ్యంలో తిరుప్పూరు కార్పొరేషన్ 60 వార్డు అన్నాడీఎంకే కార్యకర్తలు, నిర్వాహకులు, ఎంజీఆర్‌ మన్రం ప్రతినిధులతో పాటు.. వందలాదిమంది కార్యకర్తలు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాగా క్యాంపు రాజకీయాలతో తన ఎమ్మెల్యేలు పట్టు జారిపోకుండా జాగ్రత్తపడుతున్న శశికళ వారందరిని గోల్డెన్ బే రిసార్టులో దాచిపెట్టిన సంగతి తెలిసిందే. 
 
పన్నీర్ తిరుగుబాటు ఎగురవేసిన మరునాడే ఎమ్మెల్యేలను ఆమె గోల్డెన్ బే రిసార్టుకు తరలించారు. రిసార్టులో ఎమ్మెల్యేల ఖర్చులకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది. గడిచిన వారం రోజులకు గాను దాదాపు కోటి రూపాయలకు పైనే రిసార్టు యాజమాన్యం బిల్లులు వేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చిన్నమ్మ జైలుకు వెళ్తే.. పన్నీర్ సెల్వం బల నిరూపణ చేస్తారా? లేకుంటే పన్నీర్‌ను సీఎంగా మళ్లీ ప్రమాణం చేయిస్తారా? అలా గాకుండా శశి వర్గం నుంచి కొత్త సీఎం అభ్యర్థిని నియమిస్తారా? అనేది తెలియాల్సి వుంది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

శశికళ ఆశలు గల్లంతు... చిన్నమ్మతో జైలుకెళ్లనున్న ఇళవరసి - సుధాకరన్

తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై వీకె.శశికళ పెట్టుకున్న కోటి ఆశలు గల్లంతయ్యాయి. జయలలిత ...

news

శశికళకు కన్నీరు- పన్నీర్‌కే పన్నీరు చల్లిన సుప్రీం కోర్టు.. సెల్వం ఇంటివద్ద పండేగ పండగ

దివంగత సీఎం జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం కోర్టు దోషిగా ప్రకటించింది. కర్ణాటక ...

news

శశికళ జైలుకు.. పదేళ్ల పాటు పోటీకి అనర్హురాలు.. ఆ ముగ్గురు కోర్టులో లొంగిపోండి!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు సుప్రీం కోర్టులో షాక్ తగిలింది. సుప్రీం కోర్టులో ...

news

శశికళకు షాక్.. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల జైలు... సీఎం ఆశలు ఆవిరి

దివంగత ముఖ్యమంత్రి జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఖరారు ...

Widgets Magazine