Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికళ.. ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోండి : ఎంకే స్టాలిన్

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (10:14 IST)

Widgets Magazine
stalin

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోవాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, విపక్ష నేత ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లకు విజ్ఞప్తి చేశారు. అలాగే, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యేందుకు నిర్ణయించి.. ఆయన అపాయింట్‌మెంట్ కోరారు. 
 
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడాన్ని అడ్డుకోవాలని వినతిపత్రం సమర్పించనున్నారు. దీంతో పాటు రేపు ప్రధాని నరేంద్ర మోడీతో కూడా సమావేశం కానున్నారు. తమిళనాడు పరిణామాలపై జోక్యం చేసుకోవాలనీ కోరనున్నారు. శశకళ సీఎం అవ్వడాన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామనే దానిపై పార్టీ అభిప్రాయంతో పాటు తన అభిప్రాయాన్ని కూడా ప్రధానికి వివరించనున్నట్టు డీఎంకే ప్రకటించింది. 
 
చట్టప్రకారం ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా పకడ్బందీగా అన్ని చర్యలు తీసున్నామని శశికళ శిబిరం భావిస్తోంది. అయితే స్టాలిన్ మాత్రం తమిళ ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఏఐఏడీఎంకే నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారనీ... అదే ఎజెండాగా ప్రధానితో చర్చించనున్నారని చెబుతున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

వృద్ధాశ్రమంలో బాలికపై గ్యాంగ్ రేప్-కడుపునొప్పి, రక్తస్రావంతో తల్లడిల్లిన బాలికకు మాత్రలిచ్చి?

రాజమండ్రిలోని ఓ వృద్ధాశ్రమంలో పనిచేస్తున్న దళిత బాలిక (12)పై ఆశ్రమ నిర్వాహకులైన ఆ ...

news

సీఎంగా శశికళ ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపండి : సుప్రీంలో పిల్

తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ నటరాజన్ బాధ్యతలు చేపట్టకుండా ఆపాలని సుప్రీంకోర్టులో ఓ ప్రజా ...

news

కట్నంగా రూ.25లక్షలిచ్చారు.. 20తులాలిచ్చారు.. ఆపై ఐదు లక్షలిచ్చారు.. ఇంకా తెమ్మనేసరికి?

అదనపు కట్నం కోసం భర్త పెట్టే వేధింపులు భరించలేక ఇంక్‌పాడ్ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్ ...

news

అమెరికా గడ్డ మీద జిహాదీలు లేకుండా చేస్తాం: డొనాల్డ్ ట్రంప్

అమెరికా దాని మిత్ర దేశాల ఉగ్రవాదాన్ని తుదముట్టిస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ...

Widgets Magazine