శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 జులై 2017 (16:20 IST)

జయలలితను పెళ్లి చేసుకుంటానని ఓ వ్యక్తి నమ్మించి గొంతుకోశాడు: శశికళ భర్త నటరాజన్

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. వివాహం కాలేదని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఆమెకు ఓ పాపాయి వుండేదని కూడా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో జయలలితకు అనుమానపు బుద్ధి ఎక్కువని.. ఎవ్వరినీ అంత సులభంగా ఆమె న

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. వివాహం కాలేదని అందరూ చెప్పుకుంటున్నారు. అయితే ఆమెకు ఓ పాపాయి వుండేదని కూడా చర్చ సాగింది. ఈ నేపథ్యంలో జయలలితకు అనుమానపు బుద్ధి ఎక్కువని.. ఎవ్వరినీ అంత సులభంగా ఆమె నమ్మే వారు కాదని శశికళ భర్త నటరాజన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అనారోగ్యం నుంచి కోలుకున్నాక.. జయలలితపై వివాదాస్పద కామెంట్లు చేస్తూ వస్తున్న నటరాజన్.. తాజాగా.. జయమ్మను పెళ్ళి చేసుకుంటానని ఓ వ్యక్తి నమ్మించి గొంతుకోశాడన్నారు. వారి అన్నావదినలు కూడా ఆమెకు మోసం చేశారన్నారు. 
 
ఇలా ఇతరుల చేతిలో అనేకసార్లు మోసపోయిన జయలలితకు అనుమానాలెక్కువని.. అందుకే జీవితంలో ఆమె ఎవరినీ నమ్మేవారు కాదని నటరాజన్ చెప్పారు. అలాగే జయలలితకు విషంతో కూడిన ఇంజెక్షన్ వేసినట్లు శశికళపై విమర్శలు వస్తున్న తరుణంలో.. ఈ విషయంపై కూడా నటరాజన్ నోరు విప్పారు. జయలలిత మరణంలో పలు అనుమానాలున్నాయని ఇప్పటికే అన్నాడీఎంకే రెబల్ ఓపీఎస్‌తో పాటు పలువురు రాజకీయ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇంకా జయలలిత మరణంలో చిన్నమ్మ పాత్ర వుందని కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత విషయాలను మళ్లీ తెరపైకి తెచ్చేలా నటరాజన్ కామెంట్లు చేస్తున్నారు. దీంతో నటరాజన్‌పై చిన్నమ్మకు చిర్రెత్తుకొస్తోంది. అసలే అక్రమాస్తుల కేసులో జైలులో ఉన్న శశికళకు నటరాజన్ చేసే వ్యాఖ్యలు తలనొప్పిని తెచ్చిపెట్టాయి. జయలలితకు తాము స్లో పాయిజన్ ఇంజెక్షన్ వేసినట్లు అందరూ చెప్పారు. కానీ అదంతా అసత్యమని అపోలోలో అమ్మకు ఇచ్చిన చికిత్సలో తేలిపోయిందని నటరాజన్ వ్యాఖ్యానించడంతో మన్నార్గుడి ఫ్యామిలీ మొత్తం ఆయనపై కోపంతో ఊగిపోతున్నారని సమాచారం.