Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శశికి జైలు ముందే తెలుసు.. శివనమలై ఆండవర్ కోయిల్‌లో ఇనుప గొలుసును ఉంచి పూజ..

గురువారం, 16 ఫిబ్రవరి 2017 (09:12 IST)

Widgets Magazine

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ కేసు తీర్పు ముందుగానే తెలిసిపోయింది. శివనమలై ఆండవర్‌ ఉత్తర్వుల పెట్టెలో ఇనుప గొలుసును ఉంచి పూజ చేయడం ద్వారా చిన్నమ్మ ఊచలు లెక్కలు పెడుతోంది. ఇక శివనమలై ఆండవర్ కోయిల్ తిరుప్పూర్ జిల్లా గాంగేయం శివనమలై ఉంది. ఇక్కడ వెలసిన సుబ్రహ్మణ్య స్వామి భక్తుల స్వప్నంలో కనిపిస్తే.. ఆండవర్‌ నిర్దేశిత వస్తువులను పెట్టెలో ఉంచి పూజించాలని ఆదేశిస్తారు. 
 
ఉత్తర్వులు పొందిన భక్తులు ఆలయానికి వచ్చి పూజారి వద్ద తెలియజేస్తే, దేవుని ఉత్తర్వులను ఖరారు చేసేందుకు భగవంతుని వద్ద పుష్పాన్ని కోరి అనుమతులు పొందిన తర్వాతే ఉత్తర్వుల వస్తువును పెట్టెలో ఉంచుతారు. ఆ వస్తువు మరో ఉత్తర్వు వచ్చేంత వరకు పెట్టెలో అలాగే ఉంటుంది. అలా ఉంచిన వస్తువుకు సంబంధించి ఏదైనా ఓ సంఘటన చోటుచేసుకుంటుందని భక్తులు గాఢంగా నమ్ముతారు. 
 
భగవంతుని ఉత్తర్వుల పెట్టెలో తుపాకీ ఉంచిన సమయంలో చైనా యుద్ధం, జలాన్ని ఉంచినపుడు సునామీ వంటి వివిధ సంఘటనలు సంభవించాయి. గత జనవరి 10వ తేదీ నుంచి ఆండవర్‌ ఉత్తర్వుల పెట్టెలో ఇనుప గొలుసును ఉంచి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం శశికళతో సహా ముగ్గురికి జైలు శిక్ష ఖరారు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పును ముందుగానే తెలియజేసే విధంగా శివనమలై ఆండవర్‌ ఇనుప గొలుసును ఉంచి పూజించాలని భక్తులను ఆదేశించినట్టు భక్తులు అంటున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

కుదిరితే అధికారం.. లేదంటే మధ్యంతరమే.. డీఎంకే ఆచితూచి అడుగులు

తమిళనాడు రాష్ట్రంలోని అధికార అన్నాడీఎంకేలో ఏర్పడిన అంతర్గత సంక్షోభాన్ని తనకు అనుకూలంగా ...

news

పెళ్లైన ప్రియుడిని అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించింది.. చంపేశాడు..

పెళ్లయ్యాక ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకోమని బెదిరించిన యువతిని ఆమె మాజీ ప్రేమికుడు ...

news

ఎడప్పాడికి సీఎం పోస్ట్.. చిన్నమ్మకు జైలు... శశికళ వర్గంలో అసమ్మతి

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలుశిక్ష విధించడంతో ...

news

పన్నీర్‌కు - పళనికి దారేది? గవర్నర్ చేతిలో 'పంచ'తంత్రం

తమిళనాడు ముఖ్యమంత్రి కుర్చీకోసం తిరుగుబాటు నేత ఓ పన్నీర్ సెల్వం, శశికళ అనుచరుడు ఎడప్పాడి ...

Widgets Magazine