శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 11 జూన్ 2019 (17:03 IST)

కమల్, రజనీకాంత్‌ వల్ల తమిళ రాజకీయాల్లో శూన్యత: కట్టప్ప

తమిళ రాజకీయాల్లో సినీ నటులు కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం పట్ల బాహుబలి కట్టప్ప.. సత్యరాజ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. తమిళ రాజకీయాల్లో కమల్, రజనీ రావడం వల్ల శూన్యత ఏర్పడిందని కట్టప్ప ఆరోపించారు. 
 
వీరిద్దరి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నరు. తమిళనాడులో డీఎంకే లాంటి వేళ్ళూనుకుపోయిన పార్టీని పెకలించాలని అనుకోవడం మూర్ఖత్వమని.. రాజకీయాలు చేసేందుకు చాలామంది ఉన్నారని కట్టప్ప తెలిపారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని అన్నారు. 
 
కాగా.. తమిళ రాజకీయాలకు, అక్కడి సినిమా స్టార్లకు ఎంతటి దగ్గర సంబంధం ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇటీవల మరణించిన కరుణానిధి, జయలలిత వంటి ఉద్దండులు సినిమా రంగం నుండి వచ్చినవారే. 
 
వారి కోవలోనే తాజాగా కమల్ హాసన్, రజనీకాంత్ రాజకీయాల్లో రాజకీయాల్లో రాణించాలనుకుంటున్నారు. కానీ ఇద్దరి వల్ల తమిళనాడుకు ఒరిగేదేమీ లేదన్నారు సత్యరాజ్. ఇంకేముంది.. సత్యరాజ్ కామెంట్స్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.