గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 మే 2017 (10:54 IST)

మహాత్మాగాంధీ హత్య.. ఆ నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారు.. అది గాడ్సే పిస్టల్ నుంచి పేలలేదా?

జాతిపిత మహాత్మాగాంధీ.. అహింస కోసం ప్రాణం ఇచ్చారు. శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టారు. అయితే గాంధీజీని నాథురాం గాడ్సే చంపేశాడు. కానీ గాంధీజీ మరణంపై మరో ప్రశ్న తలెత్తింది. తాను గ

జాతిపిత మహాత్మాగాంధీ.. అహింస కోసం ప్రాణం ఇచ్చారు. శాంతియుతంగా పోరాడి దేశానికి స్వాతంత్ర్యం సంపాదించిపెట్టారు. అయితే గాంధీజీని నాథురాం గాడ్సే చంపేశాడు. కానీ గాంధీజీ మరణంపై మరో ప్రశ్న తలెత్తింది. తాను గాంధీజీని మూడుసార్లు కాల్చానని కోర్టులో గాడ్సే చెప్పాడు. కానీ గాంధీజీ శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు.. ఆ నాలుగో బుల్లెట్ ఎవరు కాల్చారనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. 
 
గాడ్సే మూడుసార్లు గాంధీని షూట్ చేస్తే.. నాలుగో బుల్లెట్‌ పేల్చిందెవరు? ఈ ప్రశ్నలపై స్పష్టత ఇవ్వాలని సుప్రీం కోర్టులో తాజాగా పిటిషన్‌ దాఖలైంది. ముంబైకి చెందిన చరిత్ర పరిశోధనకారుడు, అభినవ్‌ భారత్‌ సంస్థ ట్రస్టీ డాక్టర్‌ పంకజ్‌ ఫడ్నిస్‌ ఈ పిటిషన్‌ వేశారు. గాంధీ హత్యపై విచారణ జరపాలంటూ 1966లో అప్పటి ప్రభుత్వం వేసిన జస్టిస్‌ జేఎల్‌ కపూర్‌ కమిషన్‌ అసలు వాస్తవాలను, కుట్ర కోణాన్ని బహిర్గతపర్చడంలో పూర్తిగా విఫలమైందని, ఇందుకోసం కొత్త కమిషన్‌ను వేయాలని కోరారు.
 
గాంధీ హత్యకు సంబంధించి అసలు విషయాల్ని దాచిపెట్టేందుకు చరిత్రలోనే అతిపెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలనూ పిటిషన్‌లో లేవనెత్తారు. అంతేగాకుండా.. గాంధీ హత్యతో సంబంధం లేని వినాయక్ దామోదర్ సావర్కర్‌పై నిందమోపేందుకు ఆధారాలున్నాయా? అని పిటిషనర్‌ ప్రశ్నించారు. 1948, జనవరి 30న గాంధీ హత్య సమయంలో గాడ్సే, ఆప్టేతోపాటుగా మరో హంతకుడూ అక్కడ ఉన్నాడా? అనే కోణంలో పిటిషన్ దాఖలైంది. గాడ్సే మూడు బుల్లెట్లు పేల్చితే.. నాలుగో బుల్లెట్ పేల్చిన పాపం ఎవరిదని ఆయన పిటిషన్‌లో ప్రశ్నించారు. 
 
గాంధీ హత్య కేసులో కోర్టులు మూడు బుల్లెట్ల ఆధారంగానే గాడ్సే, నారాయణ్ ఆప్టేలను నవంబర్ 15, 1949లో ఉరిశిక్ష విధించారు. నాటి మీడియా రిపోర్టులు, నా పరిశోధనల ప్రకారం గాంధీ శరీరంలో 4 బుల్లెట్లు దిగాయి. ఏడు బుల్లెట్లుండే గాడ్సే పిస్టల్‌ నుంచి 4 వినియోగించని బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంటే నాలుగో బుల్లెట్‌ గాడ్సే పిస్టల్‌ నుంచి వచ్చే అవకాశమే లేదు. అంటే కచ్చితంగా మరో హంతకుడు అక్కడే ఉన్నాడు. అతను ఎవరనేది ఇంతవరకు తేలలేదు' అని పిటిషన్‌లో పేర్కొన్నారు.