శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 2 జులై 2015 (14:13 IST)

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు: రెండో భార్యకు ఫించన్ తీసుకునే హక్కుంది!

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేసే మహిళ (రెండో భార్య)కు భర్త ఫించన్‌ను అందుకునే హక్కు ఉంటుందని మద్రాస్ హైకోర్టు తీర్పునిచ్చింది. కోయంబత్తూర్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ స్టాన్లీ రెండో భార్య సుశీల కేసులో కోర్టు మద్రాస్ కోర్టు తీర్పునిచ్చింది. 
 
ఇక కేసు వివరాల్లోకి వెళితే... స్టాన్లీ అనే హెడ్ కానిస్టేబుల్‌కు 1973లో సుగంతి అనే మహిళతో వివాహమైంది. అనంతరం మనస్పర్థల కారణంగా వారిద్దరూ విడిపోయారు. అయితే భార్యకు విడాకులు ఇవ్వకుండానే సుశీల అనే మరో మహిళతో స్టాన్లీ సహజీవనం చేస్తున్నాడు. ఇటీవలే కానిస్టేబుల్ స్టాన్లీ, ఆయన మొదటి భార్య సుగంతి కూడా మరణించింది. 
 
ఈ నేపథ్యంలో కానిస్టేబుల్ కుటుంబానికి వచ్చే పింఛన్‌ను తనకు ఇప్పించాలంటూ సుశీల ఎకౌంటెంట్ జనరల్‌కు అప్పీలు చేసుకుంది. అయితే ఆమె చట్ట ప్రకారం స్టాన్లీ భార్య కాదంటూ ప్రతిపాదనను తిరస్కరించారు. దాంతో సదరు మహిళ హైకోర్టుకు వెళ్లడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. చట్ట ప్రకారం పెళ్లి చేసుకోకపోయినా సహజీవనం చేసిన రెండో భార్యకు పెన్షన్ ఇవ్వాల్సిందేనంటూ కోర్టు తీర్పు నిచ్చింది.