పప్పు రుచిగా లేదని క్యాంటీన్ ఆపరేటర్‌పై దాడి చేసిన శివసేన ఎమ్మెల్యే (video)
పప్పు రుచిగా లేదనే చిన్న కారణంతో శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్.. ఆకాశవాణి ఎమ్మెల్యే క్యాంటీన్ ఆపరేటర్‌పై చేయి చేసుకున్నారు. ముందుగా చెంపలు వాయించి ఆపై ముఖం మీద పిడి గుద్దులు గుద్దారు. ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డు అవ్వగా.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
నాసిరకమైన, వాసన వచ్చే పప్పు వడ్డిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూనే.. సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నాయి. ముంబై చర్చ గేట్‌లోని ప్రభుత్వ ఆకాశవాణి అతిథి గృహంలో ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ఉంటున్నారు.
అయితే మంగళవారం రోజు ఆయనకు అక్కడి సిబ్బంది భోజనం వడ్డించారు. ఈక్రమంలోనే తనకు వడ్డించిన పప్పు వాసన వస్తుండగా.. ఈ దాడి జరిగింది. ఇదే విషయమై ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ ను ప్రశ్నించగా.. తాను చేసింది తప్పేమీ కాదని సమర్థించుకున్నారు. తాను గాంధేయవాదిని కాదంటూ స్పష్టం చేశారు.