Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వరకట్నం ఇవ్వలేదని.. భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేసిన భర్త.. ఆ తర్వాత?

శనివారం, 9 సెప్టెంబరు 2017 (14:28 IST)

Widgets Magazine

వివాహ సమయంలో చెప్పిన మొత్తాన్ని వరకట్నంగా ఇవ్వలేదనే కారణంతో ఓ కిరాతకుడు కట్టుకున్న భార్య తాగే నీటిలో యాసిడ్ కలిపేశాడు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే, కేరళలోని కోళికోట్టైకి చెందిన జావేద్, ఫసీనా దంపతులు బెంగళూరులో నివసిస్తున్నారు.

ఫసీనా వద్ద వరుడి తరపు వారు పెళ్లి సమయంలో ఒకటిన్నర లక్ష రూపాయల నగదు, బంగారం అడిగారు. ఫసీనా తల్లిదండ్రులు అడిగినంత ఇవ్వలేకపోయారు. దీంతో అనేక సార్లు వరకట్నం తేవాల్సిందిగా ఫసీనాను జావేద్ వేధించాడు.
 
ఈ నేపథ్యంలో ఫసీనా భోజనం చేస్తుండగా.. గ్లాసులో కొన్ని నీళ్ళివ్వాల్సిందిగా భర్తను కోరింది. భర్త కూడా నీళ్లు తెచ్చాడు. భార్యకిచ్చాడు. అయితే ఆ నీటిలో యాసిడ్ కలిపాడు. దీన్ని తాగిన ఫసీనా రక్తంతో కూడిన వాంతులు చేసింది. ఆపై ఫసీనాను ఆమె బంధువులు ఆస్పత్రికి తరలించారు. 
 
తాగిన నీటిలో యాసిడ్ కలపడంతో ఆమె రక్తపు వాంతులు చేసిందని వైద్యులు నిర్ధారించారు. యాసిడ్ తాగడంతో ఆమె అంతర్గత అవయవాలు దెబ్బతిన్నాయని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా వుందని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  జరుపుతున్నారు.



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి... సీఎం చంద్రబాబు సీరియస్...

కర్నాటకలో ఐబీపీఎస్‌, ఆర్‌ఆర్‌బీ పరీక్ష రాసేందుకు వెళ్లిన తెలుగు అభ్యర్థులను కన్నడ సంఘాలు ...

news

డేరా బాబా లగ్జరీ లైఫ్.. బంగారు సింహాసనాలు, ఖరీదైన డోర్లు, వాల్ కర్టెన్స్ (వీడియో)

డేరా బాబా ఆశ్రమం పేరిట విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. సాధ్విలను వాడుకున్నాడు. భక్తులను ...

news

సోనియా గాంధీని నమ్ముకుని బిచ్చగాడుగా మారాడు... ఎక్కడ?

వారం రోజుల క్రితం జాడ తెలియకుండా పోయిన సోనియా గాంధీ కమెండో రాకేశ్ కుమార్ ఢిల్లీ పోలీసులు ...

news

హనీ ప్రీత్‌కు ప్రాణముప్పు? డేరా బాబా బిగ్ బాస్ షో.. హనీకి నో రూల్స్.. ఆమె భర్త కూడా?

డేరా బాబా దత్త పుత్రిక హనీ ప్రీత్ సింగ్ ప్రాణాలకు ముప్పు పొంచి వుందని ఇంటలిజెన్స్ బ్యూరో ...

Widgets Magazine