శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 నవంబరు 2015 (17:49 IST)

షీనా బోరా హత్య కేసు: పీటర్ ముఖర్జియాకు లైడిటెక్టర్ పరీక్షలు

షీనాబోరా హత్యకేసులో ప్రముఖ వ్యాపారవేత్త ముఖర్జియాకు సీబీఐ అధికారుల ఆధ్వర్యంలో లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీలో పీటర్ ముఖర్జియాకు ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. 
 
షీనా కేసులో పీటర్ ముఖర్జియా ఇచ్చిన వాంగ్మూలం ఒక్కోసారి ఒక్కోలా ఉందని.. దీంతో ఆయన చెప్పే విషయంలో వాస్తవం ఎంతమేరకు ఉందనే దానిపై నిర్ధారణకు రావడం అధికారులకు కష్టతరమైంది. 
 
దీంతో పీటర్ ముఖర్జియాకు లైడిటెక్టర్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక కోర్టును అనుమతి అడిగారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆయనకు శనివారం ఈ పరీక్ష నిర్వహించారు. సోమవారం ఆయనను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
 
ఈ నెల 19వతేదీన పీటర్ ముఖర్జియాను, ఇంద్రాణి ముఖర్జియాను పోలీసులు విచారించారు. ఈ విచారణలో ఇంద్రాణి, పీటర్‌ల సమాధానాలకు ఏమాత్రం పొంతన లభించలేదు. అందుకే పీటర్‌కు లైడిటెక్టర్ పరీక్షలు నిర్వహించి.. ఆ రిపోర్టుతో పాటు ఆయన్ని కోర్టులో హాజరుపరుచనున్నట్లు సీబీఐ అధికారులు చెప్పారు.