గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో 50 స్థానాల్లో శివసేన పోటీ

బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సమాయత్తమైంది. 50 స్థానాల్లో పోటీకి దిగనున్నట్లు పార్టీ ఎంపి అనిల్‌ దేశాయ్  ఆదివారం తెలిపారు. ఏ పార్టీతో శివసేన పొత్తు పెట్టుకోదని, ఒంటరిగానే ఈ స్థానాల్లో పోటీ చేస్తుందని చెప్పారు.

తమ పార్టీ శ్రేణులు ఎక్కడైతే ప్రజా సేవలో పాల్గన్నాయో..ఆయా నియోజక వర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను నిలబెడుతున్నట్లు అనిల్‌ దేశాయ్ చెప్పారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీ ట్రంపెట్‌ (ఓ రకమైన సంగీత వాయిద్య పరికరం) గుర్తుతో పోటీ చేయనుందన్నారు.

అంతకు ముందు జెడియు ఎన్నికల గుర్తులో కూడా బాణం ఉండటంతో ..శివసేన ఎన్నికల గుర్తుతో పోటీ చేసేందుకు ఎన్నికల కమిషన్‌ నిరాకరించింది. కాగా, బీహార్‌లో..మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరే పర్యటన, ప్రచారం గురించి అడగ్గా.. త్వరలో ప్రకటిస్తారని అనిల్‌ చెప్పారు.

గత గురువారం బీహార్‌లో ఎన్నికల ప్రచారం చేసే 22 మంది నేతల జాబితాను సిద్ధం చేసింది. 243 స్థానాలు గల బీహార్‌ అసెంబ్లీకి ఈ నెల 28, నవంబర్‌ 3, నవంబర్‌ 7 తేదీల్లో ఎన్నికలు జరగనున్న విషయం విదితమే.