Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉంటారో.. పోతారో తేల్చుకోండి.. శివసేనకు సీఎం ఫడ్నవిస్ వార్నింగ్

ఆదివారం, 29 అక్టోబరు 2017 (11:31 IST)

Widgets Magazine
devendra fadnavis

మిత్రపక్షమైన శివసేనకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మిత్రపక్షంగా ఉంటారో పోతారో తేల్చుకోవాలంటూ ఘాటైన హెచ్చరిక పంపారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యంగా చేసుకుని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా, నోట్ల రద్దు, జీఎస్టీ వంటి ప్రజావ్యతిరేక నిర్ణయాలతో ప్రధాని మోడీ పని అయిపోయిందంటూ సంజయ్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పించాయి. కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దేశాన్ని సమర్థవంతంగా ముందుకు నడిపించేలా కనిపిస్తున్నారని ఆయన చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టుగా మారాయి. 
 
పైగా, ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కాస్తంత ఘాటుగానే స్పందించారు. బీజేపీ ప్రభుత్వంలో కొనసాగుతారా? లేదా? అన్నది తేల్చుకోవాలని శివసేనకు సవాల్‌ విసిరారు. గతంలో 100మంది రాహుల్‌గాంధీలు కూడా మోడీని ఏమీ చేయలేరని రెండేళ్ల క్రితం పొగడ్తలతో ముంచెత్తిన శివసేన ఇపుడు మాట మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
తాము చేసే ప్రతి నిర్ణయాన్ని శివసేన వ్యతిరేకిస్తూనే ఉంది... కానీ ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడం సరికాదన్నారు. మహారాష్ట్రలో బీజేపీతో కలిసి శివసేన అధికారంలో భాగస్వామిగా ఉంది. ఇటీవల శివసేన - ప్రధాని మోడీని, బీజేపీని టార్గెట్‌ చేస్తూ చురకలు అంటిస్తోంది. సంజయ్‌ రౌత్ వ్యాఖ్యల నేపథ్యంలో వివాదం మరింత ముదిరింది. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం నుంచి శివసేన వైదొలిగితే ఫడ్నవిస్‌ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. శరద్‌ పవార్‌ మద్దతుపైనే బీజేపీ ప్రభుత్వ మనుగడ ఆధారపడి ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు వార్తలు

news

69వ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్‌ పరేడ్‌లో ఏడుగురు తెలుగువాళ్లు...

హైదరాబాద్ వేదికగా 69వ ఐపీఎస్ అధికారుల పాసింగ్ ఔట్ పరేడ్ జరగనుంది. సోమవారం జరిగే ఈ ...

news

వైరల్ అవుతున్న కేటీఆర్ జోక్... నవ్వకుండా ఉండలేరు..

సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్... ప్రజా ...

news

దమ్మున్నోడు రేవంత్.. ఎమ్మెల్యే పదవికి రిజైన్... టీడీపీలో ముగిసిన శకం

తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి శకం ముగిసింది. పార్టీ ప్రాథమిక సభ్వత్వం, పార్టీలో ...

news

బాబూ... ఇక ఇక్కడ చాలు... ఇదిగో నా రాజీనామా... రేవంత్ రెడ్డి

గత కొన్ని రోజులుగా తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తీవ్రస్థాయి చర్చకు తెరలేపిన రేవంత్ రెడ్డి ...

Widgets Magazine