గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 జూన్ 2021 (09:26 IST)

ఒక్క రూపాయికే పెట్రోల్ ... ఎక్కడ.. ఎందుకు?

ఒకవైపు దేశంలో పెట్రోల్ ధరలు సెంచరీ కొడుతున్నాయి. పెట్రోల్, డీజల్ ధరలు ఒకదానికొకటి పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో లీటర్ పెట్రోల్ లేదా డీజల్ ధర రూ.వంద దాటిపోయింది. అయితే, ముంబై మహానగరంలో మాత్రం ఒక్క రూపాయికే పెట్రోల్ లభ్యమవుతుంది. ఒక్క రూపాయికి పెట్రోల్ రావడం ఏంటనే కదా మీ సందేహం. అయితే, ఈ కథనం చదవండి. 
 
మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఉది. ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ఉంటే మహారాష్ట్ర పర్యావరణ మంత్రిగా ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే ఉన్నారు. అయితే, ఠాక్రే పుట్టిన రోజును వేడుకలు ఆదివారం జరిగాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని శివసేన మద్దతుదారులు డోంబివిలిలో రూపాయికే లీటరు పెట్రోలును పంపిణీ చేశారు. 
 
డోంబివిలి ఎంఐడీసీ ప్రాంతంలోని ఉస్మా పెట్రోలు పంపు వద్ద డోంబివిలి యువసేన నేత యోగేశ్ మహాత్రే వాహనదారులకు రూపాయికే పెట్రోలు అందించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు రెండు గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. పెట్రోలు పోయించుకునేందుకు జనం రోడ్డుపై క్యూకట్టారు. 
 
అలాగే, అంబర్‌నాథ్‌లో శివసేన నేత అరవింద్ వాలేకర్ కూడా 50 రూపాయలకే పెట్రోలును పంపిణీ చేశారు. విమ్కో నాకా పెట్రోలు పంపులో ఉదయం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు పెట్రోలు పంపిణీ చేశారు.