శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 1 అక్టోబరు 2021 (14:32 IST)

కారు బాన్నెట్‌పై ఎక్కికూర్చొన్న ట్రాఫిక్ కానిస్టేబుల్

మహారాష్ట్ర రాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇపుడు అందరి దృష్టిని ఆకర్షించాడు. రాంగ్ రూట్‌లో వచ్చిన కారు బాన్నెట్‌పై ఎక్కి కూర్చొన్నాడు. కారుకు వేసే చలానాను ఫోటో తీసేంత వరకు ఆయన కారు ముందు భాగం నుంచి కిందరు దిగలేదు. 
 
అంధేరీలోని డీఎన్ నగర్‌లో ఓ కారు రాంగ్ రూట్‌లో వచ్చింది. దీన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ దానికి ఫైన్ వేసేందుకు ప్రయత్నించాడు. కానీ కారు డ్రైవర్ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆగ్రహించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆ కారు బాన్నెట్‌పై ఎక్కి కూర్చొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.