మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపి ఉద్యోగిని చంపేసిన యజమాని!

murder
ఠాగూర్| Last Updated: సోమవారం, 28 డిశెంబరు 2020 (16:52 IST)
మలంద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపి ఉద్యోగిని యజమాని చంపేశాడు. ఈ దారుణ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని స్థానిక శివపురిలోని గోవర్ధన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. శివపురి ఎస్‌ఐ రాజేశ్ సింగ్ చందేల్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జరిగి 45 రోజులు గడిచింది.

శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ కేసు వివరాలను వెల్లడించారు. అతడి మరణానికి సంబంధించి తమకు ఎవరూ ఫిర్యాదు ఇవ్వలేదని, అయితే విషయం ఈరోజే తెలియడంతో సంబంధింత అధికారిని దర్యాప్తు కోసం ఆదేశించామని తెలిపారు.

కాగా, మరణించిన వ్యక్తి సోదరుడు దీనిపై మాట్లాడుతూ, ఈ సంఘటన నవంబరు 8న జరిగిందని, ఎప్పటిలానే తన సోదరుడు ఉద్యోగానికి వెళ్లాడని, అయితే మధ్యాహ్నానికి ఓ వ్యక్తి వచ్చి ‘మీ సోదరుడు హాస్పిటల్‌లో ఉన్నాడు. కడుపునొప్పితో బాధపడుతున్నాడు. వెంటనే వెళ్లండి’ అని చెప్పారని, దాంతో హుటాహుటిన వెళ్లి అతడిని కలిసినట్లు చెప్పారు.

‘నేను వెళ్లేసరికి అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. విషయం అడగ్గా.. తాను పనిచేసే ఓనర్‌తో పాటు అక్కడ పనిచేసే మరికొంతమంది కలిసి తన మలద్వారంలోకి కంప్రషర్ ఎయిర్‌ను పంపు చేశారని, దానివల్లే తాను కడుపునొప్పితో బాధపడుతున్నానని చెప్పాడు. ఎన్ని ఆస్పత్రులు తిప్పినా డాక్టర్లు చేతులెత్తేశారు. నొప్పి భరించలేక ఆ రోజే అతడు మరణించాడ’ని చెప్పాడు. దీనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోంది.దీనిపై మరింత చదవండి :